ఉత్తర ఫిలిప్పీన్స్ లోని మిండోరో ద్వీపంలో ఇవాళ రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో భూకంపం సంభవించిందనీ, రాజధాని మనీలా, పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
Earthquake: గుజరాత్ కచ్ ప్రాంతంలో ఈ రోజు భూకంపం సంభవించింది. కచ్ జిల్లాలో రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రంతో భూకంపం వచ్చింది. వరసగా రెండు రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి.
ఉత్తర భారతాన్ని భూకంపం భయపెడుతోంది. మంగళవారం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భూ కంపం సంభవించింది. ఢిల్లీ, జమ్ము కశ్మీర్, పంజాబ్, చంఢీగఢ్ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించినట్టు భూకంప అధ్యయన కేంద్రం ప్రకటించింది.
5.4 Magnitude Earthquake hits Jammu And Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో జమ్మూ కశ్మీర్‌లోని దోడాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.4గా నమోదైంది. భూకంపం సంభవించిన తర్వాత ఢిల్లీ మరియు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఈ భూకంపం కొన్ని సెకన్ల పాటు కొనసాగింది. ఈ భూకంపం వలన ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడం సంతోషించాల్సిన విషయం.…
Earthquake: ఓషియానియా దేశం అయిన ఫిజీలో భారీ భూకంపం సంభవించింది. శనివారం దక్షిణ పసిఫిక్ సముద్రంలోని ద్వీప దేశం అయిన ఫిజీలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతగా నమోదైందని యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. భూమికి 8 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది.
Earthquake: అసోంతోపాటు, అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో సోమవారం ఉదయం స్వల్పంగా భూకంపం సంభవించింది. భూమి కంపించడంతో ఆ ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సోమవారం ఉదయం 8.03 గంటలకు అస్సాంలోని సోనిట్పుర్లో భూమి కంపించింది. దీని తీవ్రత 4.4గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూఅంతర్భాగంలో 15 కిలోమీటర్ల లోతులో కదలికలు చోటుచేసుకున్నాయని వెల్లడించింది. భూకంపంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే దీనివల్ల ఎలాంటి నష్టమూ జరగలేదని అధికారులు తెలిపారు.…
Earthquake: ఆఫ్ఘనిస్తాన్ మరోసారి భూకంపం బారిన పడింది. ఆఫ్ఘనిస్తాన్లోని ఫైజాబాద్కు ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో ఉదయం 10.19 గంటలకు 5.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. భూమికి 37 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర కేంద్రీకృతం అయింది.
Earthquake: జపాన్ దేశంలో భూకంపం సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నం 3.33 గంటల ప్రాంతంలో భూకంపం వచ్చింది. జపాన్ రాజధాని టోక్యోకు తూర్పు ఆగ్నేయంగా 107 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
న్యూ కలెడోనియాకు తూర్పున పసిఫిక్ మహాసముద్రంలో శనివారం 7.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని, అదే ప్రాంతంలో పెద్ద భూకంపం సంభవించిన ఒక రోజు తర్వాత యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
దక్షిణ పసిఫిక్ ద్వీప దేశమైన వనాటు సమీపంలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. న్యూ కలెడోనియాలోని లాయల్టీ ఐలాండ్స్కు ఆగ్నేయంగా 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా శుక్రవారం సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.