Earthquake: దేశంలో భూకంపాలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. మొన్న జమ్ము కాశ్మీర్‌లో భూకంపం సంభవించగా.. ఇపుడు గౌహతితోపాటు మరికొన్ని ఈశాన్య ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. గౌహతి, ఈశాన్య ప్రాంతాల్లో భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అస్సాంలోని గౌహతితోపాటు మరికొన్ని ఈశాన్య ప్రాంతంలోని కొన్నిచోట్ల శుక్రవారం భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 4.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు వార్తా సంస్థ నివేదించింది. శుక్రవారం ఉదయం 10.16 గంటలకు భూ ప్రకంపనలు వచ్చినట్టు అధికారులు ప్రకటించారు.
Read also: Rishab Shetty: కాంతార ప్రీక్వెల్ కి ముహూర్తం ఫిక్స్…
అయితే భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం గానీ లేదా ఆస్తి నష్టంగా జరగలేదని అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లోని దోడా, కత్రా ప్రాంతాల్లో మూడు సార్లు భూకంపాలు సంభవించాయి. అంతకుముందు జూన్ 11 న కూడా అస్సాంలోని మధ్య భాగంలో 3.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారిక బులెటిన్ ధృవీకరించింది. ఆ సమయంలో కూడా ప్రాణ నష్టం జరగలేదని. ఎవరికీ గాయాలు కాలేదని.. ఆస్తి నష్టం కూడా జరగలేదని నివేదికలో తెలిపారు. బ్రహ్మపుత్ర నది ఉత్తర ఒడ్డున ఉన్న సోనిత్‌పూర్ జిల్లాలో ఉదయం 11:35 గంటలకు భూకంపం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నివేదికలో పేర్కొంది. భూమి యొక్క ఐదు కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్టు ప్రకటించారు. భూకంపం సంభవించినట్టు కేంద్ర బంగ్లాదేశ్ అని నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ ధృవీకరించిందని తెలిపారు.