శుక్రవారం తెల్లవారుజామున నేపాల్‌లో రెండు గంటల వ్యవధిలోనే రెండు భూకంపాలు సంభవించాయి. ఒకటి మోస్తరుగా, మరొకటి తేలికపాటి తీవ్రతతో సంభవించినట్లు తెలుస్తోంది.
Earthquake : ఇండోనేసియాను వరుస భూకంపాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆదివారం ఉదయం ఇండోనేసియాలోని కెపులౌన్ బటులో వరుసగా రెండుసార్లు భూమి కంపించింది. మొదట కంపించినప్పడు భూకంప తీవ్రత 6.1 గా నమోదైంది. ఈ విషయాన్ని యూరోపియన్ మెడిటేరియన్ సీస్మోలజికల్ సెంటర్ (EMSC) తెలిపింది.
ఫిజీలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రత నమోదైంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఫిజీ దక్షిణ పసిఫిక్‌లోని ఒక దేశం. ఇది 300 కంటే ఎక్కువ ద్వీపాలతో కూడిన ద్వీపసమూహం.
ఇండోనేషియాలో మరోసారి భారీ భూ కంపం సంభవించింది. జావా ద్వీపానికి ఉత్తరాన సముద్రంలో 7.0 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) శుక్రవారం ప్రకటించింది.
Earthquake: పసిఫిక్ తీరంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. పనామాలోని పసిఫిక్ తీరంలోని బోకా చికా పట్టణానికి సమీపంలో మంగళవారం ఈ భూకంప వచ్చింది. రిక్టర్ స్కేల్ పై 6.3 తీవ్రతో భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. స్థానిక కాలమాన ప్రకారం 5.18 గంటలకు భూకంపం వచ్చింది. భూకంప కేంద్ర బోకా చికాకు దక్షిణంగా 71 కిలోమీటర్ల దూరంలో, 13 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు.
రష్యా తూర్పు తీరంలో సోమవారం 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే సునామీ సంభవించలేదని, తక్షణ ప్రాణనష్టం లేదా విధ్వంసం లేదని రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది.
Earthquake: జపాన్ భూకంపంతో వణికిపోయింది. మంగళవారం ఆ దేశంలో 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర జపాన్ లోని అమోరిలో ఈ భూకంపం సంభవించినట్లు జపాన్ జాతీయ వాతావరణ సంస్థ వెల్లడించింది. భూకంపం సాయంత్ర 6.18 గంటలకు 20 కిలోమీటర్ల లోతులో సంభవించింది. భూకంపం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు సునామీ హెచ్చరికలను జపాన్ జారీ చేయలేదు.
Earthquake: ఇటీవల కాలంలో ఇండియాలోని పలు రాష్ట్రాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. రెండు రోజలు క్రితం చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో గంటల వ్యవధిలో 4 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా ఆదివారం తెల్లవారుజామున రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదు. ఆదివారం తెల్లవారుజామున 2.16 నిమిషాలకు 4.2 తీవ్రతలో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూకంప కేంద్రం 516 కిలోమీటర్ల దూరంలో…
Earthquake: దేశంలో ఇటీవల కాలంలో పలు చోట్ల భూకంపాలు వస్తున్నాయి. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ లో వచ్చిన భూకంపం ధాటికి ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోయాయి. ఇదిలా ఉంటే తాజాగా శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ లో 4.1 తీవ్రతతో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. సూరజ్‌పూర్‌లోని భట్గావ్ ప్రాంతంలో భూమికి 11 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర ఉన్నట్లు గుర్తించారు.