జమ్మూ కాశ్మీర్‌లో ఇవాళ( మంగళవారం ) తెల్లవారు జామున తీవ్ర భూకంపం వచ్చింది. రిక్టార్ స్కేల్ మీద దీని తీవ్రత 37గా నమోదైంది. ఈరోజు తెల్లవారు జాము 12.04 గంటలకు ధోడా ప్రాంతానికి ఆగ్నేయంగా ఈ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫార్ సీస్మాలజీ తెలిపింది. భూమి ఉపరితలానికి 5 కిలో మీటర్ల లోతున భూకంపం సంభవించిందని వారు వెల్లడించారు. అక్కడక్కడా చిన్నగా భూమి అదిరినట్లుగా అనిపించడంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.
Read Also: IIT Hyderabad: కలకలం రేపుతున్న ఐఐటీ విద్యార్థుల వరుస ఆత్మహత్యలు
ఒకవేళ భూకంపం తీవ్రత కొంచెం ఎక్కువైనా భదేర్వా, కిష్త్వార్, ఉధంపూర్, ధోడా పరిసరాల్లో తీవ్ర నష్టం వాటిల్లేదని నేషనల్ సెంటర్ ఫార్ సీస్మాలజీ అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో భూకంపం సంభవించినప్పుడు 2-5 సెకన్ల వరకు భూమి కంపించినట్లు స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఆ సమయానికి అందరూ గాఢనిద్రలో ఉంటారని అదృష్టవశాత్తు భూకంపం తీవ్రత పెద్దగా లేదని, ఎటువంటి నష్టం వాటిల్ల లేదని స్థానికులు తెలిపారు. అయితే, భూకంప తీవ్రత తక్కువగా ఉండటం వల్లే ఎలాంటి ప్రమాదం జరుగలేదని నేషనల్ సెంటర్ ఫార్ సీస్మాలజీ అధికారులు వెల్లడించారు. ప్రజలు భూకంపం సంభవించినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రమాదాల బారిన పడకుండా ఉంటారని వారు పేర్కొన్నారు.
Read Also: Pizza: ప్రపంచంలోనే అత్యంత చవకైన.. అత్యంత ఖరీదైన ‘చీజ్ పిజ్జా’ ఎక్కడ దొరుకుతాయో తెలుసా?
అయితే, భూకంపాలు రావడానికి ప్రధాన కారణాలు అధికారులు వెల్లడించారు.టెక్టోనిక్ ప్లేట్ల కదలిక కారణంగా భూకంపాలు వస్తాయని తెలిపారు. ఎందుకంటే ఈ ప్లేట్లు నిరంతర కదలికలో ఉంటాయి.. వీటి కదలిక సమయంలో శక్తిని విడుదల చేస్తాయి.. అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల భూకంపాలు సంభవిస్తాయని నేషనల్ సెంటర్ ఫార్ సీస్మాలజీ అధికారులు తెలిపారు. ఎందుకంటే అవి సహజ మూలం యొక్క శక్తి తరంగంగా పరిగణించబడతాయని అంటున్నారు.