Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో శనివారం 5.8 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఢిల్లీ, దాని పొరుగు ప్రాంతాలలో బలమైన ప్రకంపనలు సంభవించాయి. “ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలలో, ముఖ్యంగా జమ్మూకశ్మీర్, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి” అని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ డైరెక్టర్ జేఎల్ గౌతమ్ చెప్పారు.
Also Read: Article 370 Abrogation: ఆర్గికల్ 370 రద్దుకు నాలుగేళ్లు.. మరి ఇప్పుడు జమ్మూకశ్మీర్ ఎలా ఉంది?
ప్రాథమిక అంచనాల ప్రకారం భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైనట్లు తెలిసింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో, జమ్మూకాశ్మీర్‌లోని గుల్‌మార్గ్ జిల్లాకు వాయవ్యంగా 418కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(ఎన్‌సీఎస్) పేర్కొంది. ఎన్‌సీఎస్ ప్రకారం.. రాత్రి 9.31 గంటలకు 181 కి.మీ లోతులో భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రకంపనల వల్ల భూమి స్పల్పంగా కంపించడంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు.