తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేస్తాం, దేశంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీజేపీయే అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈనెల 31న 11 వ విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల ఖాతాలో జమ ఈ సందర్భంగా మోడీ ప్రసంగించనున్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాను.. ఇది పార్టీ ప్రోగ్రాం కాదని గుర్తుంచుకోవాలి. కేంద్రంలో లో కాంగ్రెసేతర ప్రభుత్వం…
ఏపీలో ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమవుతోందా? జగన్ ముందస్తుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రతిపక్షాలకు చిక్కకుండా ఉండేందుకు రెండు అడుగులు ముందే ఉండాలని.. రెండేళ్ల ముందే ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారా? జగన్ ముందస్తు ఎన్నికల ప్రిపరేషన్ చేస్తున్నారంటూ టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందా? ప్రభుత్వ పని అయిపోయింది కాబట్టే ముందస్తుకు ప్లాన్ వేస్తున్నారనే కృత్రిమ చర్చకు శ్రీకారం చుడుతున్నారా? అసలు ముందస్తుతో మాకేం పనంటున్న అధికార పార్టీది నిజంగా ధీమానేనా? అంతర్గతంగా రెఢీ అవుతోందా? ఏపీలో అసలేం జరుగుతోంది? ఇంకా…
తెలుగుదేశం పార్టీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాదుడే బాదుడు, మెంబర్ షిప్, ఓటర్ వెరిఫికేషన్, మహానాడుపై సమీక్ష జరిపారు. ముందస్తు ఎన్నికల ప్రస్తావనపై చర్చించారు చంద్రబాబు. ముందస్తు ఎన్నికలు వచ్చినా పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో రోజు రోజుకూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందన్నారు. ప్రభుత్వాన్ని ఎంతో కాలం నడపలేమని సీఎం జగన్‌కూ అర్థమవుతోంది. జగన్ ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు కూడా బూటకమేనని ప్రజలకూ…
ముందస్తు ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది.. మరోసారి ముందస్తు ఎన్నికల ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు మంత్రి ఆదిమూలపు సురేష్.. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదని స్పష్టం చేసిన ఆయన.. 2024లోనే ఎన్నికలు ఉంటాయన్నారు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన మంత్రి… ఈ ఏడాది చివరిలోగా దశల వారీగా 2 లక్షల 16 వేల టిడ్కో ఇల్లులు లబ్ధిదారులకు అందిస్తాం అన్నారు. ఈ ఏడాది మే నాటికి 40 వేల ఇళ్లు పూర్తి చేస్తాం…
ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం వుందని వస్తున్న వార్తలపై వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ రెండున్నరేళ్లకు ఉంటుందని సీఎం జగన్ ముందే చెప్పారని, త్వరలోనే కెబినెట్ రీ-షఫుల్ ఉండే అవకాశం వుందన్నారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ పాలన రెండూ మాకు కీలకమే అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. అవసరాన్ని బట్టి మంత్రులుగా ఉండే వాళ్ళను పార్టీకి వినియోగించుకుంటాం అన్నారు. చంద్రబాబు తన పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు ముందస్తు రాగం తీస్తున్నాడు. ముందస్తుకు…
ఏపీ పాలనపై ఫోకస్ పెట్టిన జగన్ అందులో భాగంగా పోలీస్ బాస్ ని మార్చారు. డీజీపీగా వున్న గౌతమ్ సవాంగ్ ని బదిలీ చేశారు. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీకి నియమించిన సంగతి తెలిసిందే. ఇవాళ డీజీపీగా బాధ్యతలు తీసుకోనున్నారు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. మంగళగిరిలోని పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఉదయం 9 గంటలకు బాధ్యతలు తీసుకోనున్నారు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. అనంతరం పాత డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఘనంగా వీడ్కోలు వేడుక నిర్వహిస్తారు.…
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా? వస్తే పార్టీలన్నీ రెడీగా వున్నాయా? అంటే అవుననే అంటున్నాయి. తాజాగా ఏపీలో టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబునాయుడు దీనిపై మనసులో మాట బయటపెట్టారు. మీడియాతో చిట్ చాట్ చేశారు చంద్రబాబు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నా అన్నారు. అనేక మంది సీఎంలు పని చేసినా ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన సీఎం ఎవ్వరూ లేరు.రాష్ట్రంలో ఇప్పుడు ఆర్థిక విధ్వంసం జరుగుతోంది. ఏపీ బ్రాండ్ ఇమేజీని దెబ్బ తీశారు. పారిశ్రామిక…
వైసీపీ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతుందనే ప్రచారం నేపథ్యంలో టీడీపీ సైతం అలర్ట్ అవుతోంది. ఈమేరకు ఆపార్టీ తమతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమేననే సంకేతాలను తాజాగా పంపిస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల వెల్లడైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలను ఆపార్టీ వినియోగించుకుంటోంది. ఓవైపు వైసీపీకి ఎంపీపీ పీఠాలు దక్కకుండా చెక్ పెడుతూ వచ్చే ఎన్నికల్లో పొత్తులకు ఇప్పటి నుంచి ప్రణాళికలను రచిస్తోంది. దీనిలో భాగంగానే జనసేన పార్టీని టీడీపీ నేతలు లైన్లో పెడుతున్నట్లు అర్థమవుతోంది. రాష్ట్ర…