తెలుగుదేశం పార్టీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాదుడే బాదుడు, మెంబర్ షిప్, ఓటర్ వెరిఫికేషన్, మహానాడుపై సమీక్ష జరిపారు. ముందస్తు ఎన్నికల ప్రస్తావనపై చర్చించారు చంద్రబాబు. ముందస్తు ఎన్నికలు వచ్చినా పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ప్రజల్లో రోజు రోజుకూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందన్నారు. ప్రభుత్వాన్ని ఎంతో కాలం నడపలేమని సీఎం జగన్‌కూ అర్థమవుతోంది. జగన్ ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు కూడా బూటకమేనని ప్రజలకూ అర్థమవుతోంది. ఆ వర్గం.. ఈ వర్గం అని లేకుండా అందరిలోనూ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వస్తోంది. వీటన్నింటినీ గమనించిన జగన్.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు.
కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలు టీడీపీ పైనే ఆశలు పెట్టుకున్నారు. గ్రామాల్లో టీడీపీకి స్వాగతాలు.. గడపగడపలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు నిలదీతలే అందుకు నిదర్శనం అన్నారు చంద్రబాబునాయుడు. బాదుడే బాదుడు కార్యక్రమంలో గ్రామ స్థాయి వరకు ఎక్కడా నిర్లక్ష్యం చెయ్యకుండా ఇంటింటికీ వెళ్లాలన్నారు. పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లాలని చంద్రబాబు సూచించారు.
RevanthReddy:కుంభకర్ణుడిలా కేసీఆర్ వ్యవహారం..!