సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యేందుకు ఈ మూవీ సిద్దమవుతుంది.. ఈ సినిమా కోసం గత కొన్ని నెలలుగా ఆయన ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్ని అప్డేట్స్ సినిమా పై మంచి హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి.. ఇక ప్రతి ఏడాది న్యూయర్ వేడుకల కోసం మహేష్ ఫ్యామిలితో కలిసి దుబాయ్ కు వెళ్తున్నాడు..…
తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమా ‘అయలాన్’.. ఆర్. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కెజెఆర్ స్టూడియోస్, 24ఎఎం స్టూడియోస్ పథకాలపై కోటపాడి జె. రాజేష్, ఆర్.డి. రాజా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ‘అయలాన్’ అంటే ‘ఏలియన్’ అని అర్థం. ఏలియన్ ఓ ప్రధాన పాత్రలో దక్షిణాది భాషల్లో సినిమా రావడం ఇదే మొదటిది.. సైన్స్…
వేడుక ఏదైనా.. అక్కడ కేక్‌కు మాత్రం ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఒకప్పుడు బర్త్‌డే అంటనే కేక్ కట్ చేసేవారు. కానీ ఎలాంటి సెలబ్రేషన్స్ అయినా కేక్ కట్ చేయాల్సిందే. వేడుకను బట్టి స్పెషల్‌గా కేక్‌ను తయారు చేయించుకుంటున్నారు. ఇందుకోసం వేలల్లోనే ఖర్చు చేస్తున్నారు. అయితే తాజాగా ఓ స్పెషల్ కేక్ వీడియో ట్రెండింగ్‌లో నిలిచింది. వధువు ఆకారంలో ఉన్న ఈ కేక్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరిదైన కేక్‌గా రికార్డుకు ఎక్కింది. అయితే దీని ప్రత్యేకతలు, ధర…
వరల్డ్ క్లైమేట్ యాక్షన్ కీలక శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు దుబాయ్‌కు వెళ్లనున్న సందర్భంగా వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో వారికి సహాయపడేందుకు తగిన వాతావరణ ఫైనాన్సింగ్, సాంకేతికత బదిలీతో అభివృద్ధి చెందుతున్న దేశాలకు మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం పిలుపునిచ్చారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో రేపు (డిసెంబరు 1) ప్రపంచ వాతావరణ సదస్సు జరగనుంది.
Wife Kills Husband: భార్య పుట్టిన రోజు వివాదం భర్తకు చావుగా మారింది. తన పుట్టిన రోజు వేడుకల కోసం దుబాయ్‌కి తీసుకెళ్లలేదని భార్య, భర్తను కొట్టి చంపింది. ఈ ఘటన పూణేలో చోటు చేసుకుంది. దుబాయ్ తీసుకెళ్లేందుకు నిరాకరించడంతో భార్య, భర్త ముక్కుపై కొట్టింది. దీంతో 36 ఏళ్ల వ్యక్తి మరణించాడు. పూణేలోని వానావ్డీ ప్రాంతంలోని ఓ రెసిడెన్షియన్ సొసైటీలో శుక్రవారం ఈ దారుణం జరిగింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో అక్కడి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షం దాటికి రోడ్లు చెరువులను తలపించాయి. రోడ్లపై భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇప్పుడు క్రికెట్ ప్రపంచమంతా వన్డే వరల్డ్ కప్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. వరల్డ్ కప్ ముగియగానే ఐపీఎల్ కోసం ఎదురుచూస్తారు. అయితే దానికోసం ఐపీఎల్ 2024 కోసం ఫ్రాంచైజీలు సన్నాహాలు ప్రారంభించాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2024 వేలం డిసెంబర్ 19న దుబాయ్లో జరుగనున్నట్లు బీసీసీఐ తెలిపింది. కాగా.. ఈనెల 26లోగా ఫ్రాంచైజీలు తాము విడుదల చేసిన, తమ వద్ద ఉంచుకున్న ఆటగాళ్ల జాబితాను సమర్పించవల్సి ఉంటుంది.
30 ఏళ్ల సౌరభ్ చంద్రకర్ 30,000 కోట్ల రూపాయలకు యజమాని అవుతాడని కలలో కూడా అనుకోలేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆన్లైన్ బెట్టింగ్ ప్రపంచంలో ‘మహాదేవ్ యాప్’ని ప్రారంభించిన వెంటనే.. వందలాది ఇతర గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆ అన్ని యాప్‌ల ప్రేక్షకులను, మహాదేవ్ యాప్ ప్రేక్షకులను కలపడం ద్వారా మిలియన్ల మంది వినియోగదారులు అయ్యారు.
Compare iPhone 15 Price in US and Dubai vs India: ‘యాపిల్’ లవర్స్ ఎంతగానో ఎదురుచూసిన ఐఫోన్ 15 సిరీస్ ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన విషయం తెలిసిందే. 15 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లను యాపిల్ రిలీజ్ చేసింది. 15 సిరీస్ ప్రీ బుకింగ్స్ నేడు ఆరంభం కానుండగా.. విక్రయాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. అయితే ప్రస్తుతం ఐఫోన్ 15 సిరీస్…