Narendra Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురవారం రాత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి దుబాయ్ వెళ్లారు. ఈ నేపథ్యంలో దుబాయ్ లో దిగిన భారత ప్రధానికి అక్కడ ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయ ప్రాంగణమంతా ప్రవాస భారతీయుుల మోడీ అనే నినాదాలతో మారు మోగింది. కాగా దుబాయ్ పర్యటనలో ఉన్న మోడీ అరబ్ దేశంలో మొత్తం 21 గంటల సమయం గడపనున్నారు. ఈ పర్యటనలో ముందుగా ఈ రోజు జరగనున్న రెండు వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ ఈవెంట్స్‌లో పాల్గొంటారు. అనంతరం అరబ్ దేశం లోని నాలుగు చోట్ల దౌత్య పరమైన అంశాలపై ప్రసంగిస్తారు. ఆ తరువాత ఆ దేశం లోని పారిశ్రామిక వేత్తలు, ప్రతినిధులు, ఉన్నతాధికారులతో నిరవహించనున్న ఏడు ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొంటారు.
Read also:Nagarjuna Sagar: సాగర్ రగడ.. ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసులు
కాగా యూఏఈతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంటే.. ఇంధన రంగంలో భద్రతతో పాటూ, బలాన్ని కూడా పెంచుకోవచ్చు అని మోడీ పేర్కొన్నారు. అలానే గ్లోబల్ సోలార్ ఫెసిలిటీకి మద్దతు ఇవ్వడం ద్వారా ఒకరికి ఒకరు సప్పోర్ట్ గా ఉండొచ్చని.. భారత్, యూఏఈ ఇరు దేశాలలో సుసంపన్నమైన భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందన్నారు. అలానే తాను యూఏఈలో పర్యటించడం ఇది ఆరవ సారి అని పేర్కొన్నారు. కాగా గ్లోబల్ సౌత్‌కి ప్రాధాన్యత ఇవ్వడంలో ఎక్కడా రాజీపడకూడదని చెప్తూ.. ఉదాహరణగా ఈమధ్య కాలంలో ఢిల్లీ వేదికగా నిర్వహించిన జీ20 సమావేశాలను గుర్తు చేశారు.