Drunk Driving: ఈ మధ్యకాలంలో కొందరు యువత పబ్లిక్ లో కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఎక్కువ అయిపోయింది. కొంతమంది యువతీ యువకులు చుట్టుపక్కల ఏమి జరుగుతున్న పట్టించుకోకుండా పబ్లిక్ లోనే సరసాలు కాని చేస్తున్న సంఘటనలు సంబంధించిన వీడియోలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా తన ప్రియురాలితో, స్నేహితులతో మద్యం మత్తులో బెట్టింగ్ వేశాడు ఓ యువకుడు. ఇందులో భాగంగా యువకుడు కారును సముద్రంలోకి తీసుకువెళ్లాడు. ఈ…
Jackfruit: ‘‘పనస పండు’’ తిని వాహనాలు నడుపుతున్నారా..? అయితే మీరు చిక్కుల్లో పడ్డట్లే. ఒకవేళ పోలీసులు ‘‘డ్రంక్ అండ్ డ్రైవ్’’ టెస్ట్ నిర్వహిస్తే, మీరు మద్యం తాగకున్నా తాగినట్లు రీడింగ్ చూపించే అవకాశం ఉంది. కేరళకు చెందిన ఈ సంఘటనకు పరిశీలిస్తే అసలు విషయం అర్థమవుతుంది. ముగ్గు
హైదరాబాద్‌లో రెండు ప్రాంతాల్లో నిర్వహించిన డ్రంక్ డ్రైవ్ పరీక్షల్లో స్కూల్ బస్సు డ్రైవర్లు పట్టుబడ్డారు.. యూసఫ్ గూడ బస్తీలో ట్రాఫిక్ పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు.. అయితే..ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో క్వీన్స్, ప్రిజం స్కూల్ బస్సు డ్రైవర్లు పట్టుబడ్డారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో డ్రైవర్ కు 156 రీడింగ్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో బస్సును స్వాధీనం చేసుకున్నారు.
తిరుమలలో వరుస అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. వరుస వైఫల్యాలతో టీటీడీ నిఘా విభాగం సతమతం అవుతోంది. డ్రోన్ కలకలం నుంచి, హజ్రత్ డ్రెస్, క్యాప్‌తో తిరుమలకు ముస్లిం వ్యక్తి అలిపిరి టోల్ గేట్‌లో ప్రవేశించే వరకు అనేక ఘటనలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి.
హైదరాబాద్‌లోని బాలనగర్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు సంచలనం రేపింది. మద్యం మత్తులో ఓ యువకుడు ఫార్చునర్ కారుతో యువతిని బలంగా ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో 19 ఏళ్ల యువతి సాయి కీర్తి తీవ్రంగా గాయపడింది. ఈ రోజు ఉదయం బాలనగర్ ఐడీపీఎల్ చౌరస్తాలో ఈ ఘటన జరిగింది. ఫార్చునర్ కారులో అతివేగంగా ప్రయాణిస్తున్న యువకుడు మద్యం మత్తులో ఉండటంతో అదుపుతప్పి రోడ్డుపై నడుస్తున్న సాయి కీర్తిని ఢీకొట్టాడు.
Drunken Drive : హైదరాబాద్‌లో మద్యం మత్తులో వాహనం నడిపిన ఓ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన పంజాగుట్ట ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళితే, ఉప్పల్ నుండి పంజాగుట్ట మీదుగా అమీర్‌పేట వైపు వెళ్తున్న ఓ వాటర్ ట్యాంకర్‌ను ట్రాఫిక్ పోలీసులు అనుమానంతో ఆపి తనిఖీ చేపట్టారు. పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్‌ఐ ఆంజనేయులు ట్యాంకర్ డ్రైవర్ యాదగిరిపై బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా, 325 బ్లడ్ అల్కహాల్ కంటెంట్ (BAC) పాయింట్స్…
Godavarikhani: రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా గోదావరిఖని రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో శనివారం 5K రన్‌ను ప్రారంభించారు. పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ శాంతి కపోతాలను ఎగరవేసి ఈ 5K రన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారులతో పాటు కమిషనరేట్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రతీ వాహనదారుడి సహకారం అవసరం అని అన్నారు. ప్రమాద రహిత కమిషనరేట్ గా…
Punishment For Drunk And Drive: మద్యం మత్తులో కారు నడిపి రోడ్డు ప్రమాదానికి కారణమైన ఓ యువకుడు, అతని స్నేహితురాలికి జడ్జి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, వెస్ట్‌మారేడుపల్లి సుమన్ హౌసింగ్ కాలనీలో నివసించే 27 ఏళ్ల తీగుళ్ల దయా సాయిరాజ్ (27), ఆయన స్నేహితురాలు గత నెల ఫిలింనగర్‌లో జరిగిన ఓ విందులో మద్యం తాగారు. ఆ తర్వాత అర్ధరాత్రి 2.30 గంటలకు, దయా…
భారతదేశంలో ప్రతి గంటకు 52 రోడ్డు ప్రమాదాల్లో 20 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల కారణంగా మరణాల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఇటీవలి డెహ్రాడూన్ కారు ప్రమాదంలో 6 మంది యువకులు మరణించడం రోడ్డు ప్రమాదాలపై తీవ్రంగా కృషి చేయవలసిన అవసరాన్ని బలంగా లేవనెత్తింది.
మద్యపానం మన సమాజంలో ఒక సాంఘిక సమస్యగా మారింది, దీని ప్రభావం చాలా తీవ్రమైంది. మద్యం మత్తులో వాహనాలను నడిపించడం అనేది అనేక ప్రమాదాలను పుట్టించటమే కాకుండా, అనేక ప్రాణాలను కూడా బలిగొంటున్నది. ఈ అలవాటు వల్ల ప్రతి సంవత్సరం వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.