Godavarikhani: రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా గోదావరిఖని రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో శనివారం 5K రన్‌ను ప్రారంభించారు. పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ శాంతి కపోతాలను ఎగరవేసి ఈ 5K రన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారులతో పాటు కమిషనరేట్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రతీ వాహనదారుడి సహకారం అవసరం అని అన్నారు. ప్రమాద రహిత కమిషనరేట్ గా మార్చడానికి మనం అందరం కలిసి పనిచేయాలని, ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరిస్తూ, సీట్ బెల్ట్ వేసుకుని వాహనాలు నడపాలని ఆయన కోరారు.
Also Read: PM Modi Vizag Tour: విశాఖ పర్యటనకు ప్రధాని మోడీ.. రోడ్ షో, బహిరంగ సభపై ప్రభుత్వం ఫోకస్!
మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారు వారు చేసిన తప్పులపై గత ఏడాది 13 కోట్ల రూపాయల జరిమానాలు చెల్లించారని ఆయన తెలిపారు. 5K రన్‌ను ప్రారంభించడం వలన రోడ్డు భద్రతపై అవగాహన పెరిగేందుకు దోహదం అవుతుందని, ప్రజలు రోడ్డు భద్రత నియమాలను పాటించి ప్రమాదాల నుంచి తప్పించుకోవాలని పోలీసులు సూచించారు.
Also Read: Sydney Test: భారత్ ఘోర ఓటమి.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకున్న ఆసీస్