భారతదేశంలో ప్రతి గంటకు 52 రోడ్డు ప్రమాదాల్లో 20 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల కారణంగా మరణాల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఇటీవలి డెహ్రాడూన్ కారు ప్రమాదంలో 6 మంది యువకులు మరణించడం రోడ్డు ప్రమాదాలపై తీవ్రంగా కృషి చేయవలసిన అవసరాన్ని బలంగా లేవనెత్తింది.
మద్యపానం మన సమాజంలో ఒక సాంఘిక సమస్యగా మారింది, దీని ప్రభావం చాలా తీవ్రమైంది. మద్యం మత్తులో వాహనాలను నడిపించడం అనేది అనేక ప్రమాదాలను పుట్టించటమే కాకుండా, అనేక ప్రాణాలను కూడా బలిగొంటున్నది. ఈ అలవాటు వల్ల ప్రతి సంవత్సరం వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
మద్యం సేవించి వాహనాలు నడపరాదని పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు. కానీ మందుబాబులు హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అలానే తాగి వాహనాలను నడుపుతున్నారు.
న్యూ ఇయర్ వచ్చేస్తోంది.. మందు వేద్దాం.. ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం.. రచ్చ చేస్తామంటే కుదరదు.. ఎందకంటే.. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు తెలంగాణ పోలీసులు.. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠినంగా వ్యవహరించనున్నారు.. తాగి వాహనం నడుపుతూ మొదటిసారి దొరికితే రూ.10 వేల జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధించనున్నారు.. ఇక, రెండో సారి పట్టుబడితే పదిహేను వేల ఫైన్ లేదా రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు.. డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు…