పశ్చిమ బెంగాల్ లో రెండు వేర్వేరు చోట్ల విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. శివుడికి మొక్కుబడి ఉందని గంగాజలం కోసమని వెళ్లి ముగ్గురు యువకులు నదిలో మునిగిపోయారు. అసన్‌సోల్‌లో జరిగిన ఘటనలో ఒకరు గల్లంతు కాగా.. ముర్షిదాబాద్‌లోని బహరంపూర్‌లో జరిగిన ఘటనలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.
Boat Capsized : మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. బుల్దానా జిల్లా మెహకర్ తాలూకాలోని అంత్రి దేశ్‌ముఖ్ వద్ద పంగంగా నదిలో మహిళా కూలీలతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళా కూలీ మృతి చెందింది.
కొందరి నిర్లక్ష్యం మరొకరికి ప్రాణ సంకటంగా మారుతోంది. ఇంటిలో ఉన్న సంపు పై కప్పు మూయకపోవడంతో ఓ బాలుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్ పేట్ బషీరాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్ లోని గుండ్లపోచంపల్లి ఎస్సి కాలనీలోని ఓ ఇంటి ఆవరణలో 2 ఏళ్ళ బాలుడు ఆడుకుంటున్నాడు. అయితే.. ఆ సమయంలో అక్కడే తెరిచి ఉన్న నీటి సంప్‌లో పడి 2 ఏళ్ల బాలుడు కృష్ణ దాస్ మృతి చెందాడు. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు…