Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నిక సందర్భంగా భద్రత, పర్యవేక్షణ విషయంలో ఎన్నికల అధికారులు కీలక చర్యలు చేపట్టారు. ఈ ఎన్నికల నిర్వహణలో మొదటిసారిగా డ్రోన్లను వినియోగించనున్నారు. పోలింగ్ లొకేషన్లలో 139 డ్రోన్లను ఉపయోగించి సెక్యూరిటీ మానిటరింగ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. డ్రోన్ల నుంచి వచ్చే ఫీడ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం కానుంది. ఈ మేరకు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన డ్రోన్ల ఏర్పాట్లను చీఫ్…
Jubilee Hills Bypoll: రేపు జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. సెక్టార్ల వారీగా బూతులను విభజించి, ఎక్విప్మెంట్ డిస్ట్రిబ్యూషన్ చేపట్టింది. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ జరిగింది.
Pulivendula Election: కడప జిల్లాలోని పులవెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 5 గంటల తర్వాత తెర పడనుంది. దీంతో పులివెందులలో ఐదు పోలింగ్ కేంద్రాలు ఉండగా అన్ని కేంద్రాలు సమస్యాత్మకమే.. అలాగే, ఒంటిమిట్టలో 17 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. అందులో 4 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నాయని పోలీసులు గుర్తించారు.
Drug Abuse: వాణి నగర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న చెట్లు పొదల మధ్య ఆరుగురు యువకులు మత్తు ఇంజక్షన్లు చేతికి ఎక్కించుకుంటున్న విజువల్స్ డ్రోన్ కెమెరా గుర్తించింది. వెంటనే స్పందించిన స్పెషల్ పార్టీ పోలీసులు అక్కడికి చేరుకుని ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు.
Drone squadrons: భారత్-పాకిస్తాన్ సరిహద్దులు మరింత శత్రు దుర్భేద్యంగా మారనుంది. శత్రు దేశాల నుంచి వచ్చే డ్రోన్లను నిర్వీ్ర్యం చేసేందుకు సరిహద్దుల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) ‘‘డ్రోన్ స్వ్కాడ్రన్’’ను మోహరిస్తోంది. మే 7 నుంచి మే 10 మధ్య పాకిస్తాన్‌తో నాలుగు రోజుల పాటు తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత కోల్‌కతాలోని ప్రముఖ ప్రదేశాలపై రాత్రిపూట అనేక డ్రోన్ లాంటి వస్తువులు ఎగురుతూ కనిపించాయి. దీంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అప్రమత్త మయ్యాయి. సోమవారం హేస్టింగ్స్ ప్రాంతం, పార్క్ సర్కస్, విద్యాసాగర్ సేతు, మైదాన్ మీదుగా కనీసం 8-10 మానవరహిత డ్రోన్‌లు ఆకాశంలో చక్కర్లు కొట్టినట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. డ్రోన్ లాంటి వస్తువులను మొదట హేస్టింగ్స్ పోలీస్ స్టేషన్ అధికారులు చూశారు.
విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. 2018లో అప్పటి హోం మంత్రి చిన్నరాజప్ప చేతులు మీద భూమి పూజ జరిగిన అరిలోవా పోలీస్ స్టేషన్‌ను ఈ రోజు కూటమి ప్రభుత్వమే ప్రారంభించిందన్నారు. విశాఖలో రోడ్డు యాక్సిడెంట్ బాధితుల సహకార కేంద్రం ప్రారంభించామన్నారు.