Pulivendula Election: కడప జిల్లాలోని పులవెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 5 గంటల తర్వాత తెర పడనుంది. దీంతో పులివెందులలో ఐదు పోలింగ్ కేంద్రాలు ఉండగా అన్ని కేంద్రాలు సమస్యాత్మకమే.. అలాగే, ఒంటిమిట్టలో 17 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. అందులో 4 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పులివెందులలో 550 మంది పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయగా.. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నిక కోసం 650 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు పులివెందులలో 550 మంది పైన బైండోవర్ కేసులు నమోదు అయ్యాయి.
Read Also: S*exual harassment: విద్యార్థినులపై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు.. 25 మంది ఫిర్యాదు
అయితే, పులివెందుల, ఒంటిమిట్టలో సాయంత్రం ఐదు గంటల తర్వాత స్థానికులు.. కానీ వారు గ్రామాల్లో ఉండటానికి వీలు లేదు. అని జిల్లా పోలీసులు వెల్లడించారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టినట్లు తెలిపారు. ఎక్కడా ఎటువంటి అల్లర్లు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేస్తామని వెల్లడించారు. ఇక, చట్టాన్ని ఉల్లంఘిస్తే, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలియజేశారు.