రోజుకో కొత్త తరహాలో డ్రగ్స్‌ను తరలిస్తున్నారు స్మగ్లర్లు.. ప్యాసింజర్ విమానాల్లో డ్రగ్స్ తరలిస్తూ వరుసగా దొరికిపోతున్న ఘటనలు చాలా ఉండగా.. ఉప్పుడు.. కార్గోను ఎంచుకున్నారు.. అది కూడా పసిగట్టిన డీఆర్‌ఐ అధికారులు.. ఢిల్లీ అంతర్జాతీయ కార్గోలో భారీగా డ్రగ్స్ పట్టివేశారు.. రూ.434 కోట్ల విలువ చేసే హెరాయిన్ సీజ్ చేశారు డీఆర్‌ఐ అధికారులు.. ఉగాండా నుండి ఢిల్లీ వచ్చిన ఓ భారీ పార్శిల్‌లో హెరాయిన్‌ను గుర్తించారు. తెల్లటి హెరాయిన్‌ను ట్రాలీ బ్యాగ్‌ల కింద దాచి తరలించే ప్రయత్నం చేశారు. 126 ట్రాలీ బ్యాగ్‌ల్లో హెరాయిన్ దాచిన స్మగ్లర్స్.. కొత్త రూట్‌లో తరలించే ప్రయత్నం చేసి దొరికిపోయారు.
Read Also: European Parliament: పార్లమెంట్‌లో డ్యాన్సులు… ఏకిపారేస్తున్న నెటిజన్లు..!
విమానం మార్గం ద్వారా డ్రగ్స్ తరలిస్తే పట్టుబడుతున్నామనే నేపథ్యంలో కొత్త పద్ధతిలో డ్రగ్స్ తరలించే ప్లాన్ చేశారు.. ఢిల్లీకి పార్శిల్ ద్వారా 330 కొత్త ట్రాలీ బ్యాగ్‌లను పంపించారు స్మగ్లర్స్.. ఇక, ఎవరికీ అనుమానం రాకుండా 330 ట్రాలీ బ్యాగ్స్ గాను 126 బ్యాగ్‌ల్లో హెరాయిన్ దాచి పెట్టారు కేటుగాళ్లు.. అయితే, ట్రాలీ బ్యాగ్స్ కింది భాగంలో ఉన్న హెరాయిన్ గుట్టును డీఆర్‌ఐ రట్టు చేసింది.. మొత్తం 62 కిలోల హెరాయిన్ సీజ్ చేసింది.. దీని విలువ రూ.434 కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది.. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. పార్శిల్ వచ్చిన అడ్రస్, పంపిన అడ్రస్ ఇలా.. రెండు అడ్రస్‌లపై ఆరా తీస్తున్నారు అధికారులు. ఉగాండాలో ఉన్న అడ్రస్ ఎవరిది అనే కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నారు.