MK Stalin: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ బుధవారం విద్యార్థులతో ముచ్చటించారు. విభజన సిద్ధాంతాలను స్వీకరించవద్దని వారిని హెచ్చరించారు. నాథూరామ్ గాడ్సే మార్గాన్ని తిరస్కరించాలని సూచించారు. ‘‘గాంధీ, అంబేద్కర్ మరియు పెరియార్ తీసుకున్న మార్గాలతో సహా మనకు అనేక మార్గాలు ఉన్నాయి. కానీ మనం ఎప్పుడూ గాడ్సే గ్రూపు మార్గాన్ని తీసుకోకూడదు’’ అని ఆయన తిరుచ్చిలోని జమాల్ మొహమ్మద్ కళాశాలలో విద్యార్థులను ఉద్దేశించి అన్నారు.
DMK Leader: శ్రీరాముడిపై డీఎంకే మంత్రి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. డీఎంకే నేత, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎస్ రెగుపతి మాట్లాడుతూ.. శ్రీరాముడు ‘‘ద్రావిడ నమూనాకు ఆద్యుడు’’ అని అన్నారు. సోమవారం కంబన్ కజగం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాముడు సామాజిక న్యాయ పరిరక్షకుడు అని ఆయన అన్నారు.
ప్రజలు గుజరాత్ మోడల్ విడిచి పెట్టి ద్రవిడ మోడల్ అనుసరించాలని మక్కల్ నీది మయ్యం అధినేత కమలహాసన్ పిలుపునిచ్చారు. భారత్ ఇకపై ద్రవిడ మోడల్ పాటించాలని పేర్కొన్నారు.