గత ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగా.. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో కొద్దిరోజులుగా తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా జులై మొదటివారంలోనే భారీవర్షాలు కుమ్మేస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో పదేళ్ల నాటి వర్షపాతం రికార్డులు సైతం గల్లంతయ్యాయి. ఈ సీజన్‌లో రాష్ట్రంలో సగటు సాధారణ వర్షపాతం కంటే రెండింతలు ఎక్కువగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయితే.. గోదావరి వరదతో భద్రాద్రి రామాలయం పడమరమెట్ల వద్ద…