Donald Trump: టెక్ కంపెనీలపై ట్రంప్ దాడి.. ఐఫోన్లను అమెరికాలో తయారు చేయాల్సిందే.. లేకపోతే 25 శాతం సుంకం
- టెక్ కంపెనీలపై ట్రంప్ దాడి
- ఐఫోన్లను అమెరికాలో తయారు చేయాల్సిందే
- ఐఫోన్‌తో సహా అమెరికాలో తయారు చేయని అన్ని స్మార్ట్‌ఫోన్‌లపై 25 శాతం సుంకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం మరోసారి ట్రేడ్ వార్ గురించి ఊహాగానాలకు ఆజ్యం పోశారు. జూన్ 1 నుంచి యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చే అన్ని దిగుమతులపై 50 శాతం సుంకాన్ని, ఆపిల్ ఐఫోన్‌తో సహా అమెరికాలో తయారు చేయని అన్ని స్మార్ట్‌ఫోన్‌లపై 25 శాతం సుంకాన్ని విధిస్తామని ఆయన ప్రకటించారు. ఆయన ప్రకటన ప్రపంచ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించింది. ట్రంప్ EU ని లక్ష్యంగా చేసుకుని, వాణిజ్య చర్చలు నిలిచిపోయాయని అన్నారు. వారితో మా చర్చలు సఫలం కాలేదు. EU అన్యాయంగా ప్రవర్తిస్తోందని ఆరోపించిన ఆయన, అమెరికన్ ఉత్పత్తులను యూరప్‌లో నిషేధించాలని పట్టుబట్టారు.
Also Read:Ramakrishna : ఘనంగా ప్రారంభమైన ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’ ..
Also Read
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
ఆపిల్ కంపెనీకి ట్రంప్ హెచ్చరిక
దేశీయంగా ఐఫోన్లను ఉత్పత్తి చేయాల్సి వస్తుందని ట్రంప్ ఆపిల్‌ను హెచ్చరించారు. లేకపోతే ఆపిల్ కొత్త సుంకాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించాడు. అమెరికాలో ఉత్పత్తి జరగాలని చాలా కాలం క్రితమే ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌తో చెప్పానని ట్రంప్ అన్నారు. భారతదేశంలో ఒక ప్లాంట్ నిర్మించబోతున్నామని టిమ్ కుక్ అన్నారు. భారత్ కు వెళ్ళడం నాకేమీ అభ్యంతరం లేదు, కానీ సుంకం లేకుండా అమెరికాలో అమ్మలేరు అని చెప్పానని ట్రంప్ అన్నారు. అమెరికాలో ఐఫోన్ అమ్మాలనుకుంటే, దానిని అమెరికాలో తయారు చేయాలని సూచించారు. ట్రంప్ హెచ్చరికల తర్వాత ఆపిల్ షేర్లు 3 శాతం తగ్గాయి.
Also Read:Nizamabad: జక్రాన్ పల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. బావ బామ్మర్దుల మృతి
చైనా సుంకాల బారి నుంచి తప్పించుకోవడానికి ఆపిల్ ప్రస్తుతం తన ఐఫోన్ అసెంబ్లీలో ఎక్కువ భాగాన్ని భారత్ కు మారుస్తోంది. కానీ, ట్రంప్ నిర్ణయాలతో అమెరికాలో ఐఫోన్‌లను తయారు చేయడం వల్ల ధరలు వందల నుంచి వేల డాలర్లు పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. జూన్ చివరి నాటికి ఆపిల్, శామ్‌సంగ్, ఏవైనా విదేశీ ఫోన్‌లపై స్మార్ట్‌ఫోన్ సుంకాలు విధించబడతాయని ట్రంప్ స్పష్టం చేశారు.
Also Read:Disha Patani : బాబోయ్.. బికినీలో హీటు పుట్టించిన దిశా పటానీ..
గత సంవత్సరం, EU USకి $500 బిలియన్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. ఎగుమతి చేసిన దేశాల్లో జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ ముందున్నాయి. 50 శాతం సుంకం కార్లు, ఔషధాలు, విమానాలు వంటి ఉత్పత్తులను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇది అమెరికన్ వినియోగదారుల ఖర్చులను పెంచే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి