Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ‘లిబరేషన్ డే’ టారిఫ్ లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ విధించిన దిగుమతి సుంకాలను అమెరికాలోని కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ బుధవారం అడ్డుకున్నట్లు ప్రకటించింది. న్యాయస్థానం తన తీర్పులో ట్రంప్ తన అధికార పరిధిని మించి చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.
Read Also: Hrithik Roshan: హృతిక్ రోషన్ తో హోంబలే ఫిల్మ్స్ గ్రాండ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్..!
మ్యాన్ హాటన్ లోని కోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల బృందం ఇచ్చిన తీర్పులో.. అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించే అధికారం కేవలం కాంగ్రెస్‌కే ఉందని, అధ్యక్షుడికి అత్యవసర అధికారాలు ఉన్నా అవి ఆ అధికారం మీద ప్రభావం చూపవని స్పష్టం చేసింది కోర్టు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ట్రంప్ ప్రభుత్వం “లిబరేషన్ డే” పేరుతో అన్ని దిగుమతులపై కనిష్ఠంగా 10% సుంకాన్ని విధిస్తూ, ఎక్కువ ట్రేడ్ సర్ప్ ప్లస్ కలిగిన దేశాలపై మరింత అధిక సుంకాలు విధించనున్నట్లు ప్రకటించింది. ఈ చర్య ద్వారా స్థానిక పరిశ్రమల ఉత్పాదకతను పెంచాలని, ట్రేడ్ డెఫిసిట్‌ను తగ్గించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.
Read Also: Elon Musk: డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ సలహాదారుడిగా వైదొలిగగిన ఎలన్ మస్క్..!
అయితే, ట్రంప్ ఈ చర్యను International Emergency Economic Powers Act (IEEPA) కింద తీసుకున్నానని పేర్కొన్నారు. కాకపోతే, కోర్టు ఈ చట్టాన్ని ఆర్థిక ఒత్తిడి సాధనంగా వినియోగించేందుకు వీలు లేదని తేల్చింది. ఈ టారిఫ్‌లపై అమెరికాలోని ఐదు చిన్న దిగుమతి వ్యాపార సంస్థలు, ఒరెగాన్ రాష్ట్ర అటార్నీ జనరల్ డాన్ రేఫీల్డ్ నాయకత్వంలో ఉన్న 13 రాష్ట్రాల కూటమి వ్యాజ్యం దాఖలు చేశాయి. ఈ టారిఫ్‌లు చట్టవిరుద్ధం, నిర్లక్ష్యంగా తీసుకున్నవని, ఆర్థికంగా నష్టం కలిగించేవి అంటూ వారు పేర్కొన్నారు.