Kamal Haasan: లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో సరికొత్త పొత్తు పొడవబోతోంది. అధికార డీఎంకే పార్టీతో కమల్ హాసన్‌కి చెందిన ‘మక్కల్ నీది మయ్యం’ పొత్తు పెట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో పొత్తుపై ప్రకటన వెలువడుతుందని సోమవారం కమల్ హాసన్ తెలిపారు. చెన్నై ఎయిర్‌పోర్టులో విలేకరులతో మాట్లాడుతూ.. రెండు రోజుల్లో శుభవార్తతో మిమ్మల్ని కలుస్తానని, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన పనులు బాగానే జరుగుతున్నాయని, మంచి అవకాశం వస్తుందని, పొత్తుకు సంబంధించి రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు.
నిధుల కేటాయింపులో వివక్ష, నిర్లక్ష్యంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్రానికి వ్యతిరేకంగా కేరళ, తమిళనాడు తమ పొరుగు రాష్ట్రమైన కర్ణాటకతో కలిసి నిరసన వ్యక్తం చేశాయి. ఈ వ్యవహారానికి వ్యతిరేకంగా కేరళకు చెందిన లెఫ్ట్ ఫ్రంట్, తమిళనాడు డీఎంకే గురువారం ఢిల్లీలో నిరసనలు చేపట్టనున్నాయి.
Udhayanidhi Stalin: గతేడాది డీఎంకే పార్టీ నేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, క్యాబినెట్ మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపాయి. బీజేపీ ఈ వ్యాఖ్యల్ని తప్పు పట్టింది. దేశవ్యాప్తంగా పలు చోట్లు హిందువులు తమ మనోభావాలను దెబ్బతీశాడని చెబుతూ.. ఉదయనిధిపై కేసులు పెట్టారు.
DMK: జేడీయూ నేత, బీహార్ సీఎం ఇండియా కూటమి నుంచి, ఆర్జేడీతో పొత్తు నుంచి వైదొలిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరారు. దీంతో ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, డీఎంకేల నుంచి నితీష్ కుమార్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. తాజాగా డీఎంకే నేత టీఆర్ బాలు మాట్లాడుతూ.. ఇండియా కూటమి కోసం నితీష్ కుమార్ ‘‘హిందీ’’ని కూడా భరించామని ఆయన అన్నారు. ఇండియా కూటమిలో ఆయన సమస్యాత్మకంగా ఉన్నారని అన్నారు.
Udhayanidhi Stalin Tamil Nadu Deputy CM: క్రీడల మంత్రి, హీరో ఉదయనిధి స్టాలిన్.. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది. సీఎం ఎంకే స్టాలిన్ ఫిబ్రవరిలో విదేశీ పర్యటనకు వెళ్లే లోగా.. ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారని ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) వర్గాలు తెలిపాయి. సేలంలో జనవరి 21న జరగనున్మ డీఎంకే యూత్ వింగ్ సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయంపై…
Toilet remark row: డీఎంకే ఎంపీ దయానిధి మారన్ మాట్లాడిన వీడియో వైరల్ అయింది. హిందీ మాట్లాడేవాళ్లు తమిళనాడులో టాయిలెట్లు క్లీన్ చేస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దీనిపై బీజేపీతో సహా బీహార్ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఫైర్ అయ్యారు. బీజేపీ డీఎంకే ఎంపీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ప్రతిపక్ష ఇండియా కూటమిని టార్గెట్ చేసింది. తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. బీహార్ ప్రజలు పనిచేయకపోతే మీ పనులు నడవవు అంటూ ఆగ్రహం…
CM Nitish Kumar: ఇటీవల కాలంలో హిందీ భాష వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా తమిళనాడు నాయకులు ఈ వివాదాన్ని రేకెత్తిస్తున్నారు. అధికార డీఎంకే పార్టీ నాయకులు హిందీ భాషను తమపై రుద్దొద్దంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల గోవాల ఎయిర్ పోర్టులో ఓ తమిళ మహిళకి హిందీ రాకపోవడంపై అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది అవహేనగా మాట్లాడారంటూ.. ఏకంగా సీఎం స్టాలిన్ తప్పుబట్టారు. కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.
Gaumutra remark: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ చేసిన ‘గోమూత్ర రాష్ట్రాలు’ అనే వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. ‘‘బీజేపీ హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాల్లో, అంటే మేము వీటిని గోమూత్ర రాష్ట్రాలని పిలుస్తామని వాటిలోనే గెలుస్తుంది. దక్షిణ భారతదేశంలో బీజేపీ గెలవదు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఫలితాలు చూస్తునే ఉన్నాం’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
DMK MP: డీఎంకే ఎంపీ పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. బీజేపీ విజయాన్ని ప్రస్తావిస్తూ.. డీఎంకే ఎంపీ డీఎన్వీ సెంథిల్ కుమార్ మంగళవారం లోక్‌సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీని విమర్శిస్తూ ఆయన వ్యాఖ్యలు చేయడంపై వివాదం రాజుకుంది. బీజేపీ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ప్రధానంగా హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాల్లో లేదా మేము గోమూత్ర రాష్ట్రాలుగా పిలుస్తాము వీటిలో బీజేపీ గెలుస్తుందని, మీరు దక్షిణ భారతదేశానికి రాలేరు’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు, కేరళ,…