వచ్చే ఎన్నికల్లో DMK ఓటమి తథ్యం అని జోస్యం చెప్పారు. పాలారు నదిలో కోట్లాది రూపాయల ఇసుకను దోచేశారు.. ఇసుక దోపిడీ సహా ఎన్నో రకాలుగా డీఎంకే ప్రభుత్వం అవినీతికి పాల్పడింది.. విజయ్ తో ఎందుకు పెట్టున్నామా అని తలచుకుని తలచుకుని బాధపడుతారు.. ఆ రోజు త్వరలోనే వస్తుంది అని టీవీకే చీఫ్ పేర్కొన్నారు.
ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) కోశాధికారి మరియు ఎంపీ టీఆర్ బాలు, డీఎంకే యువజన విభాగం అధినేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు హెచ్చరిక నోట్ జారీ చేశారు. తన రాజకీయ జీవితంలో జాగ్రత్తగా అడుగులు వేయాలని కోరారు.
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని.. కేవలం దానిని వ్యతిరేకించడమే కాదని.. పూర్తిగా తొలగించాలని ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
పార్టీ అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 70వ జన్మదిన వేడుకలను మార్చి 1న అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికార డీఎంకే సన్నాహాలు చేస్తోంది. నవజాత శిశువులకు బంగారు ఉంగరాల బహుమతి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు అన్నదానం వంటి పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
గవర్నర్ ఆర్ఎన్ రవిని శాంతికి ముప్పు అని పేర్కొంటూ, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ప్రజలకు సేవ చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ.. ఆయనను పదవి నుంచి తొలగించాలని కోరుతూ తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించింది.
Regional Parties: దేశవ్యాప్తంగా ఉన్న 54 ప్రాంతీయ రాజకీయ పార్టీల్లో నంబర్-1గా జనతాదళ్(యునైటెడ్) పార్టీ నిలిచింది. కరోనా వైరస్ విజృంభించిన కాలంలో కూడా అత్యధిక సంఖ్యలో విరాళాలను సొంతం చేసుకుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏలో భాగస్వామ్య పక్షంగా, బీహార్‌లో అధికార పార్టీగా ఉన్న జేడీయూకి