Regional Parties: దేశంలోని 54 ప్రాంతీయ రాజకీయ పార్టీల్లో నంబర్-1గా జేడీయూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Regional Parties: దేశవ్యాప్తంగా ఉన్న 54 ప్రాంతీయ రాజకీయ పార్టీల్లో నంబర్-1గా జనతాదళ్(యునైటెడ్) పార్టీ నిలిచింది. కరోనా వైరస్ విజృంభించిన కాలంలో కూడా అత్యధిక సంఖ్యలో విరాళాలను సొంతం చేసుకుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏలో భాగస్వామ్య పక్షంగా, బీహార్‌లో అధికార పార్టీగా ఉన్న జేడీయూకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పార్టీకి 2020-21 ఆర్థిక సంవత్సరంలో 60.15 కోట్ల రూపాయలు డొనేషన్ల రూపంలో వచ్చాయి. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తన రిపోర్టులో వెల్లడించింది.
జేడీయూ తర్వాతి స్థానంలో తమిళనాడులోని రూలింగ్ పార్టీ డీఎంకే, ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నిలిచాయి. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలోని డీఎంకే పార్టీకి రూ.33.99 కోట్లు, ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్‌కి రూ.11.32 కోట్లు విరాళాలుగా వచ్చాయి. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్)కి నికరంగా రూ.4.16 కోట్ల డొనేషన్లు వచ్చాయి. తెలంగాణలోని రూలింగ్ పార్టీ టీఆర్‌ఎస్‌కి రూ.4.15 కోట్లు అందినట్లు ఏడీఆర్ పేర్కొంది. మొత్తం విరాళాల్లో సింహభాగాన్ని ఈ ఐదు రీజనల్ పార్టీలే సొంతం చేసుకోవటం విశేషం.
Also Read
- CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
Basara: “బాసర” అంటే బాధ మాత్రమే కాదు. ఈ విజయగాథ కూడా..
పైగా ఈ ఐదు పార్టీల్లో ఒక్కటి (ఐయూఎంఎల్) మినహా మిగతా నాలుగూ అధికారంలోనే ఉండటం గమనార్హం. 95.45 కోట్ల రూపాయలు 207 డొనేషన్ల రూపంలో కార్పొరేట్/బిజినెస్ సెక్టార్ నుంచి అందాయి. మరో రూ.25.57 కోట్లను 2,569 మంది వ్యక్తిగత విరాళాల రూపంలో ఇచ్చారు. జేడీయూకి వచ్చిన 60.15 కోట్ల రూపాయల్లో రూ.59.24 కోట్లు 58 డొనేషన్ల రూపంలో, మిగతా రూ.90 లక్షలు 272 మంది నుంచి వ్యక్తిగత విరాళాలుగా అందాయి. ప్రతిపక్ష, ఇతర పార్టీలతో పోల్చితే అధికార పార్టీలకు ఎక్కువ విరాళాలు వచ్చాయంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
ఎందుకంటే రూలింగ్ పార్టీలతో, వాటి ప్రభావం కొద్దోగొప్పో ఉండే ప్రభుత్వ అధికారులతో ఆయా వ్యక్తులకు లేదా కార్పొరేట్/బిజినెస్ సెక్టార్‌కి చాలా పనులు ఉంటాయి. గవర్నమెంట్ కాంట్రాక్టులు, వివిధ ప్రాజెక్టులు, కొత్త వ్యాపారాలకు అనుమతులు.. ఇలా పలు సందర్భాల్లో ఇరు వర్గాల మధ్య కొంత అవగాహన ఉంటుంది. కాబట్టి ఇది అధికార పార్టీలకు కలిసొస్తుంది. దీన్నే గిట్టనివాళ్లు క్విడ్-ప్రొ-కొ (నీకిది-నాకది) అని విమర్శిస్తూ ఉంటారు. ఇక జాతీయ పార్టీల విషయానికొస్తే కేంద్రంలో గత ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి అత్యధికంగా డొనేషన్లు రావటం తెలిసిందే.
తాజావార్తలు
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
-
Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
-
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
-
Impure : పెళ్లి కూతురు ‘కన్య’ కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ఇంప్యూర్’!
-
IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!