తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. Read Also: అన్నదాతలు సుభిక్షంగా ఉంటే సమాజం బాగుంటుంది: మంత్రి నిరంజన్‌రెడ్డి కేంద్రం…
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటనతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవైపు కోవిడ్ నిబంధనలు, మరోవైపు బీజేపీ క్యాండిల్ ర్యాలీ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో బీజేపీ ర్యాలీకి అనుమతిలేదని అధికారికంగా పోలీసులు ప్రకటించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో మౌనంగా ర్యాలీ తీస్తామని బీజేపీ శ్రేణులు ప్రకటించాయి. సికింద్రాబాద్ గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్ వరకు ర్యాలీ చేపడతామని బీజేపీ తెలిపింది. దీంతో సికింద్రాబాద్ లో భారీగా పోలీసులు మోహరించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె పత్రిక ప్రకటనను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం పతనం ప్రారంభమైందని, కేసీఆర్‌కు ప్రజలు చరమ గీతం పాడుతారని డీకే అరుణ మండిపడ్డారు. ప్రజాస్వామ్య బద్ధంగా దీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై పోలీసులు అక్రమ కేసులు పెట్టి రిమాండ్‌కు…
తెలంగాణ పోలీసులు.. కేసీఆర్ తొత్తులుగా మారిపోయారంటూ డీకే అరుణ ఫైర్ అయ్యారు. ఎన్నికల హామిగా రెండు పడక గదుల ఇల్లు నిర్మిస్తామని టీఆర్ ఎస్ చెప్పిందని.. గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు పడక గదుల ఇల్లు ఇస్తామని చెప్పి ఇవ్వని దుస్థితి నెలకొందని.. గత ప్రభుత్వం సేకరించిన 78 ఎకరాల భూమిలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారని తెలిపారు. కేవలం 5వందల ఇల్లు మాత్రమే నిర్మించారు తప్పితే.. లబ్ధిదారులకు…
ఢిల్లీ పర్యటనలో ఉన్న బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ అమిత్ షాతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలో ఉన్నారో లేదో తెలుసుకోకుండానే మంత్రులు ఢిల్లీకి వచ్చారా అంటూ విమర్శించారు.చావు డప్పు కొట్టించారు..ముఖ్యమంత్రికి అసలు సిగ్గుఉందా.. అంటూ ప్రశ్నించారు. రైతులు ఆందోళన చెందద్దని చెప్పిన సీఎం కేసీఆర్, పూటకో మాట మారుస్తూ వరి వేస్తే ఉరి” అని…
పేదలకు పట్టాలు ఇచ్చిన స్థలంలో నర్సింగ్ కాలేజీ కట్టడం సిగ్గు చేటని, మాజీ మంత్రి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో వైద్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటనకు ముందు బీజేపీ నాయకులతో పాటు, అఖిలపక్ష నేతలను అరెస్టు చేయడాన్ని డీకే అరుణ ఖండించారు. తను మంత్రిగా ఉన్నప్పుడు అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే, నేడు అదే స్థలం లో నర్సింగ్ కాలేజీ నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం…
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. అంతేకాకుండా మోడీ దిష్టిబొమ్మను దహనం చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. అయితే దీనిపై స్పందించిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పోలీసులపై విమర్శలు చేశారు. మోడీ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తుంటే శవయాత్రలు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని, పోలీసులా టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలా అంటూ ఆమె అగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన చేస్తే చావు డప్పు కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ లో పత్రిక ప్రకటన విడుదల చేశారు డీకే అరుణ. ఈ నెల 20 వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా చావు డప్పులు కొట్టాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునివ్వడం పై డీకే అరుణ నిప్పులు చెరిగారు. వడ్లు కొంటామని ఒక్కసారి, కొనమని చెప్తూ తెలంగాణ…
అక్కడ కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అత్తా అల్లుళ్ల మధ్య వార్ రాజుకుంది. పంతం నెగ్గించుకునేందుకు ఒకరు.. పట్టు సడలకుండా ఇంకొకరు పొలిటికల్ పన్నాగాలు పన్నుతున్నారు. ఎవరు వాళ్లు? ఏంటా రాజకీయ యుద్ధం? గద్వాలలో డీకే అరుణ వర్సెస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి..! నడిగడ్డగా పిలిచే గద్వాల రాజకీయం ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. అది రాష్ట్ర రాజకీయమైనా.. స్థానిక సమస్య అయినా నేతల మధ్య మాటల తూటాలు పేలుతాయి. అలాంటిది గద్వాల కొంతకాలంగా పొలిటికల్‌గా సైలెంట్.…
యాసంగి కాలంలో.. వరి వేసిన రైతులకు రైతు బంధు కట్ చేస్తామనే వార్తలు వస్తున్న నేపథ్యంలో… బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. రైతు బంధు పై అప్పుడు లేని ఆంక్షలు ఇప్పుడు ఎందుకు డీకే అరుణ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పై నెపం మోపి తప్పించుకోవాలని సీఎం కేసీఆర్ చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రైతు బంధు పేరుతో… సీఎం కేసీఆర్ కొత్త డ్రామాకు తెర తీశారని ఆగ్రహించారు. సీఎం కేసీఆర్ చెప్పినట్టు…