తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని… దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని అబద్ధాలు ఆడరని ఆమె మండిపడ్డారు. మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారంటూ విమర్శలు చేశారు. రైతుల వడ్లు కొనుగోలు చేయకుండా కేసీఆర్ మోసం చేస్తున్నారని డీకే అరుణ ఆరోపించారు. సీఎం కేసీఆర్ తన భాష మార్చుకోకుంటే ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. Read Also: వడ్ల…
తెలంగాణ సీఎం కేసీఆర్ పై డీకే అరుణ ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ కుటుంబానికి దేశభక్తి ఉన్నదా…? అరుణాచల్ ప్రదేశ్ పై ఏమి మాట్లాడారని నిలదీశారు డీకే అరుణ. మీకు ఉన్నదంతా ప్రజల్లో సెంటిమెంట్ ను రెచ్చగొట్టాలి… దానితో బతకాలని చూస్తున్నారని ఆగ్రహించారు. ఎన్ని వేషాలు వేసిన తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరని ఎద్దేవా చేశారు. ఇంట గెలిచి రచ్చ గెలువు… తెలంగాణ రైతులు ఆత్మహత్య లు చేసుకుంటే కుటుంబాలను పరామర్శించలేదు… పంజాబ్ రైతుల గురించి మాట్లాడుతున్నావని…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై డీకే ఆరుణ కీలక ఆరోపణలు చేశారు. దళిత బంధు, హుజురాబాద్ ఎన్నికల విజయం నుంచి ప్రజల దృష్టిని మరళ్లించేందుకు రైతు ధర్నాలు, ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. రైతు చట్టాలపై కేంద్రం మెడలు వంచుతా అని మాట్లాడుతున్న కేసీఆర్ తన మాట తీరును మార్చుకోవాలని సూచించారు. ఓట్లు, సీట్లు తప్ప ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశం కేసీఆర్‌కు లేదని డీకే అరుణ ఆరోపణలు చేశారు. Read: కొన్ని…
గవర్నర్ ను కలిసిన బీజేపీ నేతలు నిన్న నల్గొండ జిల్లా బండి సంజయ్ పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలు ఆయన కాన్వాయ్ పై దాడి పై గవర్నర్ కి ఫిర్యాదు చేసారు. అనంతరం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ… హుజురాబాద్ ఓటమిని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు అని అన్నారు. ఇక సీఎం ఆదేశాల మేరకే బండి సంజయ్ పై దాడి జరిగింది. తెలంగాణలో శాంతిభద్రతలు క్షిణీస్తున్నాయి. అందుకే గవర్నర్ దృష్టి కి తీసుకెళ్ళాం అని తెలిపారు.…
తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నిక గెలుపుతో బీజేపీ జోష్ మీద ఉంది. దీంతో భవిష్యత్ వ్యూహాలకు పదునుపెడుతోంది. 2023 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గద్దె దింపేందుకు ఇప్పటి నుంచే రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటోంది. ఇదే అంశంపై చర్చించేందుకు డీకే అరుణ నివాసంలో బీజేపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు శనివారం రాత్రి రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, హుజూరాబాద్ నుంచి ఇటీవల విజయం సాధించిన ఈటల…
కేసీఆర్ ప్రెస్ మీట్ అనంతరం డీకె అరుణ ప్రెస్ మీట్‌పెట్టి మాట్లాడుతూ.. కేసీఆర్ పై ధ్వజమెత్తారు. హుజురాబాద్ బీజేపీ గెలుపు దుబాయ్ శేఖర్‌కు సెగ తగిలించిందన్నారు. హుజురాబాద్ ఎన్నికతో కేసీఆర్‌కు కళ్లు తెరిపించాయన్నారు. ఆ రిజల్ట్ చూసి ఆయన దిమ్మ తిరిగిందన్నారు. కేసీఆర్‌ది దొంగ దీక్ష అన్నారు. 12 వందల మందిని చంపి… ఈ రోజు సుద్దపూస లెక్క మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓటమి గెలుపులు సహజం అని ఇప్పుడు అంటున్నారు.. ఆయనకు ఇప్పుడు జ్ఞానోదయమైనట్టుందన్నారు. హుజూరాబాద్‌లో అన్ని…
తెలంగాణలో జరిగిన హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఫలితాలపై ప్రధాని, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంతృప్తిని వ్యక్తం చేస్తూ , రాష్ట్రపార్టీ నేతలను అభినందించారు. తెలంగాణలో, దక్షిణభారత దేశంలో బీజేపి బలపడుతుందన్న విశ్వాసాన్ని ప్రధాని, పార్టీ జాతీయ అధ్యక్షుడు జే.పి.నడ్డా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో బద్వేల్ ఉపఎన్నికలలో ఓట్లశాతం పెరుగుదలపై సంతృప్తిని వ్యక్తం చేశారు. “దళితబంధు” పథకాన్ని రాష్ట్రమంతా అమలు చేసేలా తెలంగాణ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువస్తామన్నారు బీజేపీ నేతలు. కేంద్ర…
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటోందని ప్రధాని మోడీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆదివారం బీజేపీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ తో పాటు జెపీ నడ్డా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రల్లో పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా మారుతున్నాయన్నారు. అంతేకాకుండా దుబ్బాక, హుజురాబాద్ ఫలితాలపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ నేతలను ప్రత్యేకంగా అభినందించారు. ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లోనూ బీజేపీదే విజయమని ఆయన అన్నారు.…
హుజురాబాద్ లో పోలింగ్ ముగిసిన తరువాత అక్కడి నుండి స్ట్రాంగ్ రూమ్ కి బయలుదేరిన బస్ లు మార్గం మధ్యలో ఒక టీఆర్ఎస్ నాయకుడి హోటల్ ముందు ఎలా ఆపుతారని ప్రశ్నించారు బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకె అరుణ. బస్ రిపేర్ అయ్యిందని చెప్పి ఈవీఎం బాక్స్ లను మార్చినట్టు వీడియోలను చూసామని, వీవీ ప్యాట్ బయటికి ఎలా వచ్చిందని ఆమె ప్రశ్నించారు. పూర్తి భద్రత తో ఈవీఎంలు తరలించాలి. కానీ పోలీస్ లు లేకుండా ఎలా ఈవీఎంలను…