Telangana: తెలంగాణ ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ప్రకటించింది. ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) ను 3.64 శాతం పెంచుతూ సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన డీఏ 2022 జులై 1వ తేదీ నుంచి అమల్లో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్ జీతంతో పాటు ఈ పెరిగిన డీఏ చెల్లించనున్నారు. 2022 జులై 1 నుండి 2024 అక్టోబర్ 31 వరకు ఉన్న డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనున్నారు. వచ్చే ఏడాది మార్చి 31న పదవీ విరమణ చేయబోతున్న ఉద్యోగులకు డీఏ బకాయిలను 17 సమాన వాయిదాల్లో చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధమైంది.
Yogi Adityanath: అయోధ్యలా కాశీ, మధుర కూడా ప్రకాశించాలి.. యోగీ కీలక వ్యాఖ్యలు..
సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలలో 10 శాతం ప్రాన్ ఖాతాకు జమ చేస్తారు, మిగిలిన 90 శాతం వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లించబడనుంది. అలాగే, రిటైర్డ్ ఉద్యోగులకు డీఏ బకాయిలను 2025 జనవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లించనున్నారు. ఈ చర్యలు ఉద్యోగులకు ఆర్థిక సహాయం అందించడంలో దోహదం చేయనున్నాయి.
Ayodhya: అయోధ్యలో 25 లక్షలకు పైగా దీపాల అద్భుత దృశ్యం.. రెండు గిన్నిస్ రికార్డులు