ఎంతో ఆనందంగా టపాసులు కాల్చి సంబరాలు చేసుకొనే దీపావళి పండుగ రోజు అపశృతి చోటు చేసుకుంది. మెహదీపట్నంలో దీపావళి వేడుకలు మొదలై టపాసులు కాలుస్తుండగా ప్రమాదవశాత్తు పలువురి కంటికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని మెహదీపట్నం సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి తరలించారు. దీపావళి సందర్బంగా టపాసులు కాలుస్తుండగా ఏడుగురు గాయాలయ్యాయని.. వారిలో ఐదుగురికి ప్రథమ చికిత్స చేసి అనంతరం ఇంటికి పంపించినట్లు సరోజినీ దేవి కంటి ఆసుపత్రి ఆర్ఎంవో నాజాఫి బేగం తెలిపారు. మరో ఇద్దరిని మాత్రం…
చీకటిని పారద్రోలుతూ, వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా మన దేశ ప్రజలు దీపావళి పండగను జరుపుకుంటారు. దీపావళి రోజు టపాసులు కాల్చడం సంప్రదాయంగా మారిపోయింది. ఇంట్లో ఉంటే చిన్నారులకు అయితే దీపావళి రోజు క్రాకర్స్ కాల్చడం మహాసరదా. అందుకే పిల్లల కోసం ఎక్కువ సంఖ్యలో క్రాకర్స్‌ను కొనుగోలు చేస్తుంటారు. అయితే కరోనా నేపథ్యంలో టపాసులకు దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ చిన్నారులు టపాసులు కాల్చాలని మారం చేసినా భారీ శబ్ధాలు రాని, పర్యావరణానికి…
దీపావళి పండగ సెలబ్రేట్ చేసుకునేందుకు దేశమంతా సిద్ధమైంది. దీపావళి టపాసులు కాల్చడం అంటే చిన్నారులకు ఎంతో సరదా. అందుకే దీపావళి రోజు టపాసులు కొనిపించాలని తల్లిదండ్రుల దగ్గర పిల్లలు మారం చేస్తుంటారు. కానీ ఈ వెలుగుల నింపే పండగలో కొన్ని అపశ్రుతులు కూడా జరుగుతుంటాయి. టపాసులు కాల్చే సమయంలో గాయపడటం, నిర్లక్ష్యం కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకోవడం వంటివి ప్రతి ఏడాది మనం చూస్తూనే ఉంటాం. కానీ పిల్లల చేత క్రాకర్స్ కాల్పించే సమయంలో కొన్ని జాగ్రత్తలు…