గత రెండేళ్లలో ఎన్నడూ లేని విధంగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. కరోనా ఆంక్షలు సడలించడం, వరుసగా సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అంతకంతకూ పెరిగిపోతోంది. గుడ్‌ఫ్రైడే, వీకెండ్ సెలవులు కలిసి రావడంతో తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి రెండు కిలో మీటర్ల మేర క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 17వ…