కేవలం వీడియో, మ్యూజిక్ కంటెంట్ కోసం గత యేడాది అమేజాన్ ప్రైమ్ సంస్థ 13 బిలియన్ డాలర్లు వెచ్చించిందట. ఈ విషయాన్ని ఇటీవల సంస్థకు చెందిన ఆర్థిక వ్యవహారాల ప్రతినిధి తెలిపారు. పదమూడు మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీ లో 96 వేల కోట్ల రూపాయలు. ఈ మొత్తం చూస్తే… ఎవరైనా అమ్మో అంటూ ఆశ్చర్యపోక మానరు. కేవలం వీడియో, మ్యూజిక్ కంటెంట్ కోసం ఇన్ని కోట్ల రూపాయలా అంటూ చాలామంది నోరు వెళ్ళ బెడతారు.…
సూపర్‌స్టార్ మహేష్‌బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా తెలుగు తెరకు పరిచయమైన చిత్రం ‘హీరో’. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలైన ఈ చిత్రం కామెడీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. పండగ సమయం కావడంతో బాక్సాఫీస్ దగ్గర బాగానే కాసులు కురిపించింది. అయితే ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మేరకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను ఈరోజు ప్రకటించింది. ఫిబ్రవరి 11 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ…
జగపతిబాబు, శరత్ కుమార్ ప్రధాన పాత్రధారులుగా నవీన్ చంద్ర, ఇషాన్, ఆకాంక్ష సింగ్ తో డిస్నీ హాట్ స్టార్ తొలి సీరీస్ ను నిర్మించింది. ‘పరంపర’ పేరుతో తెరకెక్కిన ఈ సీరీస్ కి కృష్ణ విజయ్ ఎల్ దర్శకత్వం వహించారు. ఈ నెల 24 నుంచి ఈ సీరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ ఫ్యామిలీ డ్రామా సిరీస్ లో అధికారం, అవినీతి, తరతరాల శత్రుత్వం ప్రధానాంశాలుగా ఉండనున్నాయి. ‘బాహుబలి’ నిర్మాతలు శోభు యార్లగడ్డ,…
నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో మూడో చిత్రంగా విడుదలైన అఖండ.. అఖండమైన విజయాన్ని అందుకొని.. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక రికార్డులను వాసులు చేస్తోంది. బాలయ్య మాస్ యాక్షన్.. తమన్ మాస్ మ్యూజిక్ అఖండను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. డిసెంబర్ 2 న విడుదలైన ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. థియేటర్లో మాస్ జాతర చూపిస్తున్న ఈ చిత్రం త్వరలో ఓటీటీలోకి అడుగుపెట్టనున్నదట .. ఇక దీంతో బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కొత్త సంవంత్సరం…
లాక్‌డౌన్ పుణ్యమా అని దేశంలో ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. గత రెండేళ్లలో జనాలపై ఓటీటీల ప్రభావం పెరిగింది. దీంతో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, జీ5, ఆహా, సన్ నెక్ట్స్ వంటి ఓటీటీలు లాభాల బాటలో దూసుకుపోతున్నాయి. అయితే 2021 త్రైమాసికంలో దేశంలో ఎక్కువ మంది వీక్షిస్తున్న ఓటీటీలపై ‘జస్ట్ వాచ్’ అనే స్ట్రీమింగ్ గైడ్ సర్వీస్ రివ్యూ చేసింది. ఈ రివ్యూలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంతో పోలిస్తే…
తేజ సజ్జ, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘అద్భుతం’. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ నెల 19 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఈ సినిమా భారీ అంచనాలనే రేకెత్తించాయి. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని చిత్రబృందం రిలీజ్ చేసింది. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. ట్రైలర్ విషయానికొస్తే.. తేజ, శివాని వేర్వేరు ప్రదేశాల్లో…
దీపావళి కానుకగా సినీ ప్రేక్షకులకు ఓటీటీ వేదికగా మరో సినిమా అందుబాటులోకి రానుంది. సందీప్ కిషన్ నటించిన గల్లీ రౌడీ సినిమా ఓటీటీ డేట్స్ ఫిక్సయింది. ఈ మూవీ నవంబర్ 4 నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 17న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. ఈ చిత్రంలో సందీప్ కిషన్‌కు జోడీగా నేహాశెట్టి నటించింది. కామెడీ ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కింది. బాబీ సింహా, రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి,…
గోపీచంద్, తమన్నా జంటగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్’. సంపత్ నంది దర్శకత్వంలో చిట్టూరి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 10వ తేదీ విడుదలైన కమర్షియల్ గా మంచి ఓపెనింగ్స్ ను సాధించింది. భూమిక, రెహ్మాన్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కి, యువతనూ ఆకట్టుకుంది. కమర్షియల్ హంగుల్ని దర్శకుడు సంపత్ నంది చక్కగా అద్దగా, దానికి తగ్గట్టుగానే మణిశర్మ మాస్ ను అలరించే ట్యూన్స్ ఇచ్చారు. దాంతో ఇది మ్యూజికల్…
కరోనా తర్వాత ప్రాంతీయ భాషల్లోకి ఓటీటీ సంస్థలు పరుగుపెడుతున్నాయి. డిస్నీ హాట్ స్టార్ కూడా తెలుగులో రాబోతోంది. దీనికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండనున్నారు. మన వినోద విశ్వం అనే ట్యాగ్‌లైన్‌తో రామ్ చరణ్ డిస్నీ హాట్ స్టార్‌ను ప్రమోట్ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల మెప్పు కోసం హాట్ స్టార్ ప్రణాళికలను సిద్దం చేసింది. స్టార్ హీరోల సినిమా హక్కులతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి చిత్రాలను కూడా తెలుగు ప్రేక్షకులకు…
మాస్, కమర్షియల్, ప్రయోగాత్మకైనా సినిమాలు చేసి టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మెగాస్టార్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన నేడు తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుని పాన్ ఇండియా హీరోగా మారుతున్నాడు. టాలీవుడ్ లో చరణ్ కు ప్రత్యేకంగా కావాల్సినంత ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రాజమౌళి “ఆర్ఆర్ఆర్”లోనే కాకుండా, తండ్రితో కలిసి కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న “ఆచార్య”లో…