మాస్, కమర్షియల్, ప్రయోగాత్మకైనా సినిమాలు చేసి టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మెగాస్టార్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన నేడు తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుని పాన్ ఇండియా హీరోగా మారుతున్నాడు. టాలీవుడ్ లో చరణ్ కు ప్రత్యేకంగా కావాల్సినంత ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రాజమౌళి “ఆర్ఆర్ఆర్”లోనే కాకుండా, తండ్రితో కలిసి కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న “ఆచార్య”లో కూడా కనిపించబోతున్నాడు. మరోవైపు విజనరీ డైరెక్టర్ శంకర్ తో “ఆర్సీ 15” అనే పాన్ ఇండియా సినిమాకు కూడా రెడీ అయిపోయాడు.
Read Also : మళ్ళీ పెళ్లి కూతురైన సమంత !
ఇదిలా ఉండగా చరణ్ పాన్ ఇండియా క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి కొన్ని బ్రాండ్స్. డిస్నీ+ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ సర్వీస్‌ని ప్రమోట్ చేయడానికి రామ్ చరణ్ సిద్ధంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లో చరణ్ మెజీషియన్ గా కనిపిస్తాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే ప్రసారం కానుంది. బాలీవుడ్ లో కింగ్ ఖాన్- షారూఖ్ ఖాన్ డిస్నీ హాట్ స్టార్ అంబాసిడర్‌గా ఉండగా, దక్షిణాదిన రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారబోతున్నారు.