మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్- స్టార్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ వస్తున్న సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేక అంచనాల్ని రేకెత్తిస్తోంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కోసం మాటల రచయితగా సాయిమాధవ్ బుర్రాను ఎంపిక చేసింది చిత్రబృందం.. తాజాగా ప్రధాన కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్‌ను ఈ సినిమాకు తీసుకున్నారు. ఈ విషయాన్ని జానీ తెలుపుతూ.. సంతోషం వ్యక్తం చేస్తూ ఎమోషనల్ అయ్యాడు.‘ముక్కాబులా పాటకు…
డైరెక్టర్ శంకర్ తో ‘ఇండియన్ 2’ నిర్మాతల గొడవ కోర్టుదాకా వెళ్లింది. తాజాగా రిటైర్డ్ జడ్జిని రంగంలోకి దింపింది మద్రాస్ హైకోర్ట్. విశ్రాంత న్యాయమూర్తి ఆర్. పానుమతి ఇకపై లైకా ప్రొడక్షన్స్ కి, శంకర్ కి మధ్య మీడియేటర్ గా వ్యవహరిస్తారు. ఆయన సయోధ్య ప్రయత్నాల తరువాత మద్రాస్ కోర్ట్ తీర్పు వెలువరించనుంది. రిటైర్డ్ జడ్జ్ ఇవ్వబోయే నివేదికే ఇప్పుడు కీలకం కానుంది. న్యాయమూర్తి చూపే పరిష్కారానికి ఇరు పక్షాలు ఒప్పుకుంటే ‘ఇండియన్ 2’ త్వరలోనే పునః…
ప్రముఖ దర్శకుడు శంకర్ పెద్ద కుమార్తె ఐశ్యర్య వివాహం నేడు ఘనంగా జరుగుతోంది. క్రికెటర్ రోహిత్ దామోదరన్‌తో కలిసి ఆమె కాసేపటి క్రితమే ఏడడుగులు వేసింది. కరోనా కారణంగా మహాబలిపురంలో వీరి వివాహ వేడుకను నిరాడంబరం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధువులు, సన్నిహితుల మధ్య వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరై.. నూతన వధువరులను ఆశీర్వాదించారు. ఈమేరకు వివాహ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.…
తన ఒకే ఒక్క చిత్రంలో ప్రపంచంలోని ఏడు వింతలు చూపించి… వెండితెర మీద ఎనిమిదో వింతని ఆవిష్కరించాడు దర్శకుడు శంకర్. ‘జీన్స్’ లాంటి రొమాంటిక్ చిత్రం మొదలు ‘భారతీయుడు’ లాంటి సందేశాత్మక చిత్రం, ‘రోబో’ లాంటి సైన్స్ ఫిక్షన్ చిత్రం దాకా… ఆయన ఏ ప్రాజెక్ట్ చేపట్టినా అద్భుతమే! అయితే, గత కొంత కాలంగా శంకర్ టైం బ్యాడ్ మోడ్ లో నడుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఆయన చిత్రాలు తన స్థాయికి తగ్గట్టుగా సెన్సేషన్ సృష్టించటం లేదు.…
ప్రముఖ దర్శకుడు శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం జూన్ 27న క్రికెటర్ రోహిత్ దామోదరన్ తో జరుగబోతోంది. కరోనా పేండమిక్ సిట్యుయేషన్ ను దృష్టిలో పెట్టుకుని వివాహాన్ని నిరాడంబరంగా జరుపబోతున్నారు. మహాబలిపురంలో జరిగే ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన అతి కొద్ది మంది బంధు మిత్రులనే ఆహ్వానిస్తున్నారట. అయితే… వివాహానంతరం కోవిడ్ ఉదృతి తగ్గిన తర్వాత అన్ని జాగ్రత్తల నడుమ భారీగా రిసెప్షన్ ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. శంకర్ కుమార్తె ఐశ్వర్య వృత్తిరీత్యా…
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ నటిస్తుండగా, అలియా భట్ రాంచరణ్ పక్కన నటిస్తోంది. కాగా అలియా ఈ సినిమాతో పాటుగా పలు బాలీవుడ్ చిత్రాలతోను బిజీగా వుంది. అయితే ఈ బ్యూటీ మరోసారి రాంచరణ్ సరసన నటించనున్నట్లు సమాచారం. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, రాంచరణ్ హీరోగా ఓ పాన్ ఇండియా…
ప్రముఖ దర్శకుడు శంకర్ తల్లి ముత్తు లక్ష్మి (88) మరణించారు. వయోభార సమస్యలతో ఆమె మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆమె మృతికి కోలీవుడ్‌తోపాటు ఇతర చిత్ర పరిశ్రమ ప్రముఖులూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ ద్వారా ఆయన అభిమానులు కూడా సంతాపం తెలుపుతున్నారు. ప్రస్తుతం శంకర్ త్వరలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా, రణవీర్ సింగ్ హీరోగా మరో సినిమా చేయనున్నారు. కమల్ హాసన్ హీరోగా భారతీయుడు 2 తెరకెక్కిస్తున్నారు.
సెన్సేషన్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో సినిమా రానున్న విషయం తెలిసిందే. ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. రాజకీయ నేపథ్యంలో రామ్ చరణ్- శంకర్ సినిమా ఉంటుందని ప్రచారం నడుస్తుంది. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమాపై మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం నాలుగు భాషల నుంచి నలుగురు స్టార్…
ప్రముఖ దర్శకుడు శంకర్ కు ‘అన్నియన్’ (అపరిచితుడు) నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ లీగల్ నోటీస్ పంపారు. ఇటీవల రణ్వీర్ సింగ్ హీరోగా శంకర్ హిందీలో అన్నియన్ సినిమాను రీమేక్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తన అనుమతి లేకుండా తాను నిర్మించిన ‘అన్నియన్’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తామని ప్రకటించటం పై రవిచంద్రన్ శంకర్ కు లీగల్ నోటీస్ ను పంపినట్లు సమాచారం. తను హిందీ రీమేక్ ప్రకటన వినగానే షాక్ అయ్యానని, అన్నియన్ పూర్తి…