మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్- స్టార్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ వస్తున్న సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేక అంచనాల్ని రేకెత్తిస్తోంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కోసం మాటల రచయితగా సాయిమాధవ్ బుర్రాను ఎంపిక చేసింది చిత్రబృందం.. తాజాగా ప్రధాన కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్‌ను ఈ సినిమాకు తీసుకున్నారు. ఈ విషయాన్ని జానీ తెలుపుతూ.. సంతోషం వ్యక్తం చేస్తూ ఎమోషనల్ అయ్యాడు.
‘ముక్కాబులా పాటకు స్టేజ్ మీద డ్యాన్సులు చేశాను.. బాయ్స్ సినిమా కోసం 500 డ్యాన్సర్లలో ఎక్కడో మూలకు ఉన్నాను. అప్పటి నుంచి శంకర్ ను ఆరాధిస్తూనే ఉన్నాను. ఈ క్షణాలను నమ్మలేకపోతోన్నాను. రామ్ చరణ్, దిల్ రాజుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అని జానీ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. కాగా, ప్రస్తుతం శంకర్ ఈ సినిమా పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. గత నాలుగు రోజులుగా హైదరాబాదులోనే ఉన్న శంకర్ పలువురిని కలుస్తున్నారు.
Being a stage performer to #Muqabula song to Backup dancer among 500+ people in #Boys, I've admired @shankarshanmugh Sir alot. Now, being the main choreographer to his film with my fvt. Hero, person #RamCharan Sir #RC15 feels unbelievable. Thank you for believing in me Sir 😍 pic.twitter.com/W6uCWU8Kt8
— Jani Master (@AlwaysJani) July 17, 2021