ప్రముఖ దర్శకుడు శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం జూన్ 27న క్రికెటర్ రోహిత్ దామోదరన్ తో జరుగబోతోంది. కరోనా పేండమిక్ సిట్యుయేషన్ ను దృష్టిలో పెట్టుకుని వివాహాన్ని నిరాడంబరంగా జరుపబోతున్నారు. మహాబలిపురంలో జరిగే ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన అతి కొద్ది మంది బంధు మిత్రులనే ఆహ్వానిస్తున్నారట. అయితే… వివాహానంతరం కోవిడ్ ఉదృతి తగ్గిన తర్వాత అన్ని జాగ్రత్తల నడుమ భారీగా రిసెప్షన్ ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. శంకర్ కుమార్తె ఐశ్వర్య వృత్తిరీత్యా డాక్టర్ కాగా, క్రికెటర్ రోహిత్ తండ్రి దామోదరన్ పారిశ్రామిక వేత్త. అంతేకాదు… మధురై పాంథర్స్ టీమ్ స్పాన్సర్ కూడా. అలానే శంకర్ తన కుమార్తె ఐశ్వర్య వివాహాన్ని నిరాడంబరంగా జరపడానికి మరో కారణం కూడా ఉంది. ఇదే యేడాది మే నెలలో శంకర్ తల్లి కన్నుమూశారు. ఇక శంకర్ కెరీర్ విషయానికి వస్తే, ఇప్పటికే కమల్ హాసన్ తో ‘ఇండియన్ -2’ను తెరకెక్కిస్తున్న ఆయన ఆ తర్వాత రామ్ చరణ్ తో ఓ పాన్ ఇండియా మూవీని, రణవీర్ సింగ్ తో ‘అపరిచితుడు’ హిందీ రీమేక్ ను చేయబోతున్నాడు.