సెన్సేషన్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో సినిమా రానున్న విషయం తెలిసిందే. ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. రాజకీయ నేపథ్యంలో రామ్ చరణ్- శంకర్ సినిమా ఉంటుందని ప్రచారం నడుస్తుంది. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమాపై మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం నాలుగు భాషల నుంచి నలుగురు స్టార్ హీరోలను తీసుకోనున్నారట. తెలుగు వెర్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కన్నడంలో ఉపేంద్ర, తమిళంలో విజయ్ సేతుపతి, హిందీ వెర్షన్ లో సల్మాన్ ఖాన్ నటించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ పై వీరంతా అంగీకరిస్తే ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరగటం ఖాయం..!