ప్రేమ పావురాలు సినిమా వచ్చి ఎన్ని ఏళ్ళైనా భాగ్యశ్రీ నవ్వు ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రగా నిలిచిపోయింది. తెలుగులో ఆమె తీసినవి కొన్ని సినిమాలే అయినా తెలుగు అభిమానుల్లో ఆమెకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక పెళ్లి తర్వాత భాగ్య శ్రీ సినిమాలకు దూరమయ్యారు. కటుంబ జీవితానికే సమయం కేటాయించి ఆ లైఫ్ లో బిజీ అయ్యారు. సినిమా అవకాశాలు వచ్చినా నటించలేదు. అయితే ఎన్నో ఏళ్ల తర్వాత ఈ వెటరన్ నటి రాధేశ్యామ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా భాగ్యశ్రీ కనిపించనున్నారు. అయితే ఈ పాత్ర కోసం డైరెక్టర్ రాధాకృష్ణ ఎంతోమంది హీరోయిన్లను అనుకోని చివరకు బాగ్యశ్రీని సెలెక్ట్ చేశారట. ఇక ఈ సినిమా మార్చి 11 న రిలిఙ్ కానున్నడడంతో ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న భాగ్యశ్రీ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
” ఈ సినిమా కథను రాధాకృష్ణ చాలా అద్భుతంగా నేరేట్ చేశారు. కథలో నా పాత్ర నచ్చడంతో నేను వెన్తనె ఓకే చేశాను. మొదటి నుంచు నేను అంత పెద్ద డాన్సర్ ని కాదు.. కానీ ఈ సినిమాలో నాతొ డాన్స్ చేయించారు. మొదటిసారి సెట్ లో ప్రభాస్ ని కలవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. సెట్ లో ప్రభాస్ ని చూసాకా ఎలా వెళ్లి మాట్లాడాలి అని అనుకుంటుండగానే ఆయనే నా దగ్గరకు వచ్చి తనకు తానే పరిచయం చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి నా ప్యాన్ అని చెప్పడంతో నేను షాక్ అయ్యాను. ఆయన చాలా డౌన్ టూ ఎర్త్ అందరు చెప్తే విన్నాను .. మొదటిసారి సెట్ లో చూశాను. చాలా సర్ ప్రైజ్ అయ్యాను. పాన్ ఇండియా స్టార్ అన్న గర్వం ఇసుమంతైనా కనిపించలేదు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.