రాధేశ్యామ్ ప్రమోషన్స్ జోరందుకున్నాయి.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రాబోతుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన రాధేశ్యామ్ ఎట్టకేలకు మార్చి 11 న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం వరుస అప్డేట్లు, ఇంటర్వ్యూలతో బిజీబిజీగా మారింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజగా ఈ సినిమా మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. రాధేశ్యామ్ సాగా పేరుతో రిలీజ్ చేసిన ఈ మేకింగ్ వీడియోలో నాలుగేళ్ల్లు చిత్ర బృందం పడిన కష్టాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. యూరప్ లో ఎంతో అందమైన లొకేషన్స్, ఆ మంచులో చిత్ర యూనిట్ షూటింగ్ చేయడం.. మధ్యలో కరోనా వలన షూటింగ్ ఆగిపోవడం.. భారీ భారీ సెట్స్ ని ఇండియాలో వేసి మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేయడం కనిపిస్తుంది.
ఇక ఈ షూట్ లో ప్రభాస్ బాగా ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తుంది.. సెట్ లో రాజమౌళి, కార్తికేయ హంగామా హైలైట్ గా నిలిచింది. ఏదిఏమైనా ఎన్నో అడ్డంకులను, అవాంతరాలను దాటుకొని ఎట్టకేలకు ఈ సినిమా వెండితెరపై కనిపించబోతుంది. ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో డైరెక్టర్ రాధా నాలుగేళ్ల కృషికి ఫలితాన్ని అందుకుంటాడేమో చూడాలి.