దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు జన్మదినం మే23. నేటితో ఆయన 80వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా కె.రాఘవేంద్రరావు ఓ లేఖ రాశారు. ఈ జన్మదినం ప్రత్యేకత ఏంటంటే.. దర్శకునిగా శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించాను. ఈ అనుభవంతో ఓ పుస్తకాన్ని రాశాను. అది 1963వ సంవత్సరం ఆరోజు నాకు ఇంకా కళ్లముందే ఉంది.అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదటిరోజున ‘పాండవ వనవాసం’ చిత్రానికి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్టీఆర్‌పై తొలిసారి క్లాప్‌కొట్టటంతోనా కెరీర్ స్టార్టయింది. ప్రముఖ దర్శకులు…