లక్నోలో కాల్పుల ఘటనపై డిప్యూటీ సీఎం స్పందించారు. ప్రస్తుతం కాల్పులు జరిపిన వ్యక్తి పోలీసులు ఆధీనంలో ఉన్నాడని.. కాల్పులు జరిపిన నిందితుడు.. బతకడని కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. చట్ట ప్రకారం అతనికి శిక్ష పడుతుందని తెలిపారు. మరోవైపు కాల్పుల ఘటనపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రశ్నలు సంధించారు. ఈ కాల్పుల ఘటన రాష్ట్రంలో భయాందోళనకు గురిచేసిందని తెలిపారు. యూపీలో తాత్కాలిక డీజీపీ ఎందుకున్నారని ప్రశ్నించారు.