తన కెరీర్ మొదట్లో దిల్ రాజు దగ్గర రైటర్‌గా పనిచేసిన అనుభవం తన డైరెక్షన్ జర్నీకి బాగా ఉపయోగపడిందని వెంకీ అట్లూరి చెప్పుకొచ్చారు. తెలుగులో ఐదు సినిమాలు చేసిన ఆయన, ఇప్పుడు సూర్యతో ఆరవ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్ షోలో పాల్గొన్న ఆయన, దిల్ రాజు దగ్గర పనిచేసిన అనుభవం తనకు ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు. నిజానికి తాను ముందుగా నటుడిగా సినిమా చేశానని, అది వర్కౌట్ కాకపోవడంతో సినీ…
“సంక్రాంతికి వస్తున్నాం” బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ “తమ్ముడు”. నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. “తమ్ముడు” సినిమా జూలై 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్…
కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు, ఆర్టిస్టులు టెక్నీషియన్స్ కి ఇండస్ట్రీలోకి రావాలని ‘దిల్ రాజు డ్రీమ్స్’ వెబ్ సైట్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా హాజరై వెబ్ సైట్ ని లాంచ్ చేశారు. దిల్ రాజు డ్రీమ్స్ లాంచింగ్ ఈవెంట్ లో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. 13 ఏళ్ల క్రితం పొద్దున లేచి ఎక్కడైనా…
దిల్ రాజు డ్రీమ్స్ వెబ్ సైట్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా హాజరై వెబ్ సైట్ ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ సినిమా తర్వాత ఎంతోమంది కొత్త దర్శకుల్ని లాంచ్ చేసాం. వాళ్ళు ఈరోజు సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ గా ఇండస్ట్రీలో…
Thammudu : యంగ్ హీరో నితిన్ – వేణు శ్రీరామ్ కాంబోలో వస్తున్న మూవీ తమ్ముడు. జులై 4న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఓ సారి వాయిదా పడి మరీ వస్తుండటంతో ప్రమోషన్లు కూడా జోరుగానే చేస్తున్నారు. దిల్ రాజు తన ఎస్వీసీ బ్యానర్ మీద మంచి బడ్జెట్ తో తీస్తున్నారు. దగ్గరుండి ప్రమోషన్లు కూడా చేసుకుంటున్నారు దిల్ రాజు. రేపు ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది.…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో నేడు ‘అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, సినీ నటులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వినియోగాన్ని కట్టడి చేసేందుకు…
ఈ ఏడాది దిల్ రాజు భారీ అపజయం ఒకటి మూటగట్టుకున్నాడు. అలాగే సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాతో ఒక హిట్టు కూడా అందుకున్నాడు. అయితే ఇప్పుడు ఆయన నిర్మాతగా నితిన్ హీరోగా నటించిన తమ్ముడు సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. నిజానికి నితిన్ కి సరైన హిట్టు సినిమా పడి చాలా కాలం అయింది. వరుసగా నాలుగు డిజాస్టర్లు తర్వాత ఇప్పుడు తమ్ముడు అంటూ ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాని గతంలో వకీల్ సాబ్…
రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో పర్సంటేజీ విధానం లెక్కన సినిమాలాడించాలా లేక రెంటల్ విధానం లెక్కన ఆడించాలా అనే విషయం మీద కొన్ని ఇబ్బందులు ఎదురైన సంగతి తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్లందరూ ఖచ్చితంగా పర్సంటేజీ విధానంలోనే సినిమాలు ఆడించాలని లేదంటే థియేటర్లో మూసేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఒక కమిటీ కూడా ఏర్పాటు అయింది. Also Read:Icon Movie : బన్నీ వదిలేసిన ‘ఐకాన్’.. కొత్త హీరో అతనేనా..? ఈ కమిటీలో సభ్యులుగా కేఎల్…
Icon Movie : అల్లు అర్జున్ గతంలో ‘ఐకాన్’ అనే సినిమాను ప్రకటించాడు. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తారని గతంలో అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆ సినిమా ఇప్పుడు ఆగిపోయిందని దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశారు. పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్ రేంజ్ అమాంతం మారిపోయింది. అప్పటి వరకు తెలుగు, మలయాళంలో మాత్రమే మార్కెట్ ఉన్న బన్నీకి ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో మార్కెట్ ఏర్పడింది. అందుకే త్రివిక్రమ్ సినిమాను…
తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భరత్ భూషణ్‌కు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. గత ప్రభుత్వ కాలంలో భరత్ భూషణ్ ఫోన్ ట్యాపింగ్ కు గురైనట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ విషయంపై విచారణ కోసం ఆయన సోమవారం ఉదయం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధికారుల ముందు హాజరయ్యారు. భరత్ భూషణ్ ఫోన్ టాపింగ్ వ్యవహారం గత ఎన్నికల సమయంలో జరిగినట్లు అధికారులు ప్రాథమిక విచారణలో తేల్చారు. ఎన్నికలకు…