Sirish: రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు సోదరుడు శిరీష్ మాట్లాడిన మాటలు పెద్ద దుమారానికి కారణమయ్యాయి. రామ్ చరణ్ అభిమానులందరూ ఈ విషయం మీద తీవ్రంగా ఫైర్ అవడమే కాక ఇదే చివరి హెచ్చరికంటూ ఒక లేఖ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో శిరీష్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన కూడా ఒక లేఖ విడుదల చేశారు. ఆయన రాసిన లేఖ యధాతధంగా
Read Also: India-US trade deal: అమెరికా ఒత్తిడికి తలొగ్గని భారత్.. వాణిజ్య ఒప్పందంలో ప్రతిష్టంభన..
అందరికి నమస్కారం.. నేను ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు… సోషల్ మీడియాలో అపార్థాలకు దారి తీసి.. దాని వలన కొందరు మెగా అభిమానులు బాధపడినట్లు తెలిసింది. “Game Changer” సినిమా కోసం మాకు “Global Star” రామ్ చరణ్ తన పూర్తి సమయం, సహకారం అందించారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి మాకు ఎన్నో ఏళ్ళ నుంచి సాన్నిహిత్యం ఉంది. మేము చిరంజీవి, రామ్ చరణ్ తో పాటు మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడాం.. ఒకవేళ నా మాటలు ఎవరి మనోభావాలను అయినా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే.. క్షమించండి అని శిరీష్ రెడ్డి ఆ లేఖలో రాసుకొచ్చారు. ఇక, దిల్ రాజు- శిరీష్ నిర్మించిన తమ్ముడు సినిమా జులై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శిరీష్ మాట్లాడిన మాటలు రాంచరణ్ అభిమానులకు కోపం తెప్పించాయి. గేమ్ చేంజర్ డిజాస్టర్ అయిన తర్వాత శంకర్ కానీ రామ్ చరణ్ కానీ కనీసం ఫోన్ చేయలేదని శిరీష్ అన్నారు.