నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు డైరెక్షన్లో దిల్ రాజు నిర్మాణంలో రూపొందించిన తాజా చిత్రం తమ్ముడు త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసింది ఈ నేపద్యంలో ఈ సినిమాని పెద్ద ఎత్తున టీం ప్రమోట్ చేస్తోంది రకరకాల ఇంటర్వ్యూలు చేస్తూ ఇప్పటికే హీరోయిన్ అందరూ బిజీ బిజీగా ఉండగా దిల్ రాజు ఇప్పుడు నితిన్ తో కలిసి ఒక ఇంటర్వ్యూ చేశాడు.
ఇక ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర సమాధానాలు ఇద్దరు బయటపెట్టారు. అందులో భాగంగానే నితిన్ ఒకవేళ దిల్ రాజు బయోపిక్ చేయాల్సి వస్తే అనే ప్రశ్న సంధించాడు. తన బయోపిక్ తాను చేస్తే బాగోదని ఎవరైనా చేస్తే చేయొచ్చని దిల్ రాజు అన్నాడు. నిజంగా బయోపిక్ చేసే అంత పొటెన్షియల్ కంటెంట్ ఉందా అంటే కచ్చితంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. తాను 94లో సినీ పరిశ్రమలోకి వచ్చానని, ఇప్పటివరకు నిలదోక్కుకొని టాప్ నిర్మాతగా నిలబడ్డారని చెప్పుకొచ్చాడు. అయితే ఒకవేళ నిజంగానే మీ బయోపిక్ ప్లాన్ చేస్తే ఏ హీరో చేస్తే బాగుంటుంది అని అడిగితే.. ఎందుకో నితిన్ ఫేస్ కట్స్ నా ఫేస్ కట్స్ ఒకలాగే ఉన్నాయని చాలామంది చెబుతూ ఉంటారు కొంతమంది, ఈ నితిన్ మీ తమ్ముడా అని కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి తాపాత్ర నితిన్ చేస్తేనే బావుంటుందని ఈ సందర్భంగా దిల్ రాజు కామెంట్ చేశాడు. మొత్తం మీద దిల్ రాజు తన బయోపిక్ చేయాలనే కోరిక బయటపెట్టడంతో అవ్సాహిక దర్శక నిర్మాతలు ఎవరైనా దిల్ రాజు బయోపిక్ ప్లాన్ చేస్తారేమో వేచి చూడాలి మరి.