Dil Raju: సినిమా గురించి ఎక్కువ మాట్లాడొద్దని మాట తీసుకున్నాడు!
- నితిన్ హీరోగా 'తమ్ముడు' సినిమా ట్రైలర్ లాంచ్
- దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
- నితిన్‌కు కమ్‌బ్యాక్ ఫిల్మ్‌గా దిల్ రాజు ధీమా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నితిన్ తమ్ముడు సినిమా రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో నిర్మాత దిల్ రాజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నితిన్ ‘జయం’ సినిమాతో హీరోగా మారి 23 ఏళ్లయిందని, తాను ‘దిల్’ సినిమాతో నిర్మాతగా మారి 22 ఏళ్లయిందని, ‘ఆర్య’ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన వేణు శ్రీరామ్‌కు 21 ఏళ్లు పూర్తయినట్లు చెప్పుకొచ్చారు. నితిన్ ‘జయం’ సినిమాతో తనకంటే ఏడాది సీనియర్ అని ఆయన పేర్కొన్నారు.
Also Read:Kubera : ’మాది మాది సోకమంతా’ వీడియో సాంగ్ రిలీజ్
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తమ్ముడు సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా శ్రీరామ్ వేణు అనుకున్న కథని థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి వీళ్లందరినీ బెండు తీశారంటూ, సినిమాకు పనిచేసిన టెక్నికల్ టీమ్ మొత్తాన్ని స్టేజ్ మీదకు ఆహ్వానించారు. ఒక్కొక్క టెక్నీషియన్ ఎంత కష్టపడితే అవుట్‌పుట్ ఇంత బాగా వచ్చిందో తనకు తెలుసని, పేరుపేరునా ఒక్కొక్క టెక్నీషియన్‌ను ఆయన అభినందించారు. ఈ సినిమా క్రెడిట్ మొత్తం దర్శకుడికే దక్కుతుందని, ఎందుకంటే 21 ఏళ్ల జర్నీలో వేణు శ్రీరామ్ అంటే ఏంటో తమకు తెలుసని చెప్పుకొచ్చారు.
అనంతరం, సినిమాలో నటించిన నటీమణులను స్టేజ్ మీదకు తీసుకొచ్చి, నితిన్‌తో పాటు ఈ ఐదుగురు కూడా హీరోలే అని చెప్పొచ్చని దిల్ రాజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నితిన్ సక్సెస్‌లు, ఫెయిల్యూర్‌లు వస్తూ ఉంటాయని, అవి తాము చూశామని, నితిన్ చివరి 4-5 సినిమాలు సరిగా ఆడలేదని బాధలో ఉన్నాడని, కానీ ఈ సినిమా అతనికి కమ్‌బ్యాక్ ఫిల్మ్ అని దిల్ రాజు అన్నారు. అందరం ఫెయిల్ అవుతాం, సక్సెస్ అవుతామని, ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ విలువ తెలియదని చెప్పారు. ఈ సినిమాతో నితిన్‌కు మళ్లీ ఒక మంచి సక్సెస్ రాబోతోందని అన్నారు.
Also Read:Coolie : ఆ నలుగురిలో ముగ్గురు కలిసి కూలీని దించుతున్నారు!
ఈ సినిమా గురించి వేణు శ్రీరామ్ ఎక్కువ మాట్లాడొద్దని మాట తీసుకున్నాడని, అయినా సరే టెక్నీషియన్స్, నటీనటుల గురించి చెప్పానని, వారందరూ అలా చేయగలిగారంటే దానికి కారణం వేణు శ్రీరామ్ అని, సినిమా రిలీజ్ అయిన రోజు మళ్లీ మాట్లాడుకుందామని దిల్ రాజు అన్నారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!