గత కొన్ని రోజులుగా హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, నిర్మాతల మండలి, దర్శకుల సంఘం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ చిత్రంలో భజ గోవిందం పదాన్ని ఎరోటిక్ సీన్స్ నేపథ్యంలో వాడారని, దాన్ని వెంటనే తొలగించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్స్ లోనూ కేసులు పెట్టారు. దాంతో దర్శకుడు యుగంధర్ తన ప్రమేయం లేకుండా ఆ పదం పొరపాటున ట్రైలర్ లో చేరిందని బేషరతుగా…
తెలుగునేలపై విశేషంగా వినిపించే జానపదగీతాలను సినిమాలకు అనువుగా ఉపయోగించుకోవడం కొత్తేమీ కాదు. ఇప్పుడు నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ‘వరుడు కావలెను’ చిత్రంలో అలాంటి ఓ జానపదమే సందడి చేస్తోంది. ఆగస్టు 4న ‘వరుడు కావలెను’ చిత్రంలోని “దిగు దిగు నాగ…” అనే పాట లిరికల్ వీడియో విడుదలయింది. అలా వచ్చీ రాగానే ఈ పాట విశేషాదరణ పొందుతూ, కొన్ని గంటలకే మిలియన్ వ్యూస్ పట్టేసింది. ఈ పాటకు “దిగు దిగు దిగు నాగో నాగన్నా… దివ్యాసుందర నాగో…