Minister Vakiti Srihari: మంత్రి శ్రీహరి ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వ అభిమతాన్ని తెలిపారు. అధికారంలో ఉన్నా లేకపోయినా, ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని చెప్పారు. పేదల ఆకలి తీర్చడం, బడుగు బలహీన వర్గాల అవసరాలను తీర్చడమే కాంగ్రెస్ అసలైన లక్ష్యమని అన్నారు. ప్రతి బుధవారం సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించి,…
జూన్2 న భూమి లేని నిరుపేద రైతులు ఎవరైతే అసైన్డ్ భూములను సేద్యం చేస్తున్నారో వారికి పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అధికారులతో జరిగిన సమావేశంలో పొంగులేటి కీలక సూచనలు చేశారు. ధరణిలో ఏర్పడ్డ ఇబ్బందులు మళ్ళీ రిపీట్ కావద్దని, ఎట్టి పరిస్థితుల్లో పొరపాట్లు జరగొద్దని తెలిపారు.
Ponguleti Srinivas Reddy : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో మాట్లాడుతూ, ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అంకితమై పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రగతి భవన్‌ను జ్యోతి రావు ఫూలే భవనంగా మార్చిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిదేనని అన్నారు. ఇది ప్రజలకు గౌరవం ఇచ్చే ముఖ్యమైన చిహ్నంగా నిలుస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ధరణిలో చోటుచేసుకున్న అవకతవకలన్నీ సరి చేయడం కోసం కొత్త భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని తెలిపారు.…
Kadiyam Srihari : వరంగల్ జిల్లా మడికొండ సత్యసాయి గార్డెన్ లో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజాపాలన విజయోత్సవ సభకు అధ్యక్షత వహించారు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్యలు హజరయ్యారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. 15సంవత్సరాలుగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం వెనుకబదిందని దానిని దృష్టిలో పెట్టుకొని ఈసారి…
Revanth Reddy: అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే రెండు హామీలను నెరవేర్చిన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో మిగిలిన నాలుగు హామీలను కూడా నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది.