కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ధనుష్ కి కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోను ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఇటీవల ధనుష్- ఐశ్వర్య విడాకుల విషయం సోషల్ మీడియాలో వైరల్ అయినా సంగతి తెలిసిందే. 14 ఏళ్ల తమ వివాహ బంధానికి స్వస్తి పలికినట్లు ధనుష్ అభిమానులకు తెలిపారు. అయితే ఈ జంట మళ్లీ కలవనున్నారని కోలీవుడ్ వార్తలు గుప్పుమంటున్నాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు. ధనుష్ తండ్రి..ఇటీవల తన కొడుకు, కోడలితో చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే వారు మళ్లీ కలిసిపోతారని చెప్పడంతో అభిమానుల్లో మళ్లీ ఆశలు రేగాయి. ఇక తాజాగా ధనుష్ తన కొడుకు యాత్రా ధనుష్ తో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
ఇక ఆ ఫొటోలో యాత్రా ధనుష్ తండ్రికి తగ్గ తనయుడిలా కనిపించాడు. తండ్రి అంత హైట్, ధనుష్ స్టైల్ యాత్రలో కూడా కనిపిస్తోంది. ఈ ఫొటోలో యాత్రా, రజినీ స్టైల్‌లో గాల్లోకి జుట్టును లేపడం, దాన్ని సవరించడానికి ధనుష్ ప్రయత్నించడం తెలుస్తోంది. ఇక ఈ ఫొటోకు క్యాప్షన్ గా ధనుష్ ” ఈ స్టైల్ ని గతంలో ఎక్కడో చూసినట్లు ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు. తాత స్టైల్ ని తండ్రి వద్ద కాపీ కొడుతున్నాడు యాత్ర. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్స్ దేవుడా ధనుష్ కి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా..? అంటూ నోళ్లు నొక్కుకుంటున్నారు. ఇంకో రెండేళ్లలో యాత్రా కూడా సినిమా రంగ ప్రవేశం చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అంటున్నారు కోలీవుడ్ వర్గాలు.