Maaran కోలీవుడ్ స్టార్ ధనుష్ కథకు మంచి ప్రాధాన్యమున్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తారన్న విషయం తెలిసిందే. అయితే కొన్నిసార్లు స్టార్స్ స్క్రిప్ట్ ల ఎంపిక విషయంలో తప్పటడుగులు వేస్తూ ఉంటారు. తాజాగా ధనుష్ కూడా అలాగే చేసినట్టున్నాడు. మార్చ్ 11న ధనుష్ నటించిన “మారన్” అనే చిత్రం నేరుగా డిజిటల్ రిలీజ్ అయ్యింది. శుక్రవారం నుండి ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవిక మోహనన్ కథానాయికగా నటించింది. ఈ చిత్రం ప్రేక్షకులను పూర్తిగా నిరాశ పరిచిందనే చెప్పాలి. అసలు కంటెంట్ ఏమాత్రం స్ట్రాంగ్ గా లేని ఈ సినిమాకు ధనుష్ ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా ? అని ఆయన అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి Maaran సినీ ప్రియులనే కాకుండా ఆయన అభిమానులను కూడా పూర్తిగా నిరాశ పరిచింది.
Read Also : Bellamkonda Suresh : చీటింగ్ కేసుపై రియాక్షన్… నిర్మాత వార్నింగ్
హత్యకు గురైన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ రామ్ అనే వ్యక్తి కొడుకు పాత్రలో ధనుష్ నటించాడు. సినిమా అంతా మిస్టరీ గురించే. అయితే Maaran అంత ఆసక్తికరంగా సాగకపోవడం, అందులో ధనుష్ పాత్రను పేలవంగా వ్రాసి, ప్రదర్శించడం ఆయన అభిమానులకు అస్సలు నచ్చలేదు. Maaran చిత్రం 2 గంటల 10 నిమిషాల పాటు ఉంటుంది. కానీ అంతసేపు సినిమాను చూడడం చాలా కష్టం అంటూ ధనుష్ ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇంత బలహీనమైన స్క్రిప్ట్ ను ధనుష్ ఎంచుకున్నందుకు తీవ్రంగా ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్నాడు ధనుష్.