దర్శకుడు మారుతీతో ప్రభాస్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. తాత్కాలికంగా ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ త్వరగా పూర్తి కానుందని సమాచారం. మరికొన్ని రోజుల్లో ఈ చిత్రాన్ని ప్రకటించనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సినిమా లాంచ్ కు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. మారుతి ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రారంభించేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే నటీనటుల ఎంపిక జరగ్గా, ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ తన ‘ప్రాజెక్ట్ కె’ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.
Read Also : Actress Fees : ఈ స్టార్ హీరోయిన్లు ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా ?
కాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం ప్రభాస్ సరసన తమిళ బ్యూటీ మాళవిక మోహనన్ రొమాన్స్ చేయనుందట. ఇటీవల కాలంలో మాళవిక మోహనన్ తన హాట్ ఫొటోలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 2013లో రొమాంటిక్ డ్రామా ‘పట్టం పోల్’తో అరంగేట్రం చేసిన ఈ బ్యూటీ మాస్టర్‌లో తలపతి విజయ్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ తర్వాత కోలీవుడ్ లో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా మారింది మాళవిక. ఇక ఇప్పుడు మారుతీ హారర్ థ్రిల్లర్ లో ప్రభాస్ తో జోడి కట్టబోతోందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ధనుష్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ‘మారన్’లో మాళవిక కథానాయికగా కనిపించనుంది.