కొన్ని రోజుల క్రితం ఐశ్వర్య-ధనుష్ విడిపోతున్నట్టుగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత ఈ స్టార్ కపుల్ విడిపోయారు. ఈ వార్త ధనుష్, ఐశ్వర్య కుటుంబ సభ్యులకు అంతగా నచ్చలేదని చెప్పాలి. ధనుష్ తండ్రి కస్తూరి రాజా వారు విడిపోవడాన్ని కుటుంబ తగాదాగా చెప్పుకొచ్చారు. అంతేకాదు ధనుష్, ఐశ్వర్య మళ్లీ కలుస్తారని ఆయన చాలా నమ్మకంగా ఉన్నాడు. ఇక తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం సూపర్ స్టార్ రజనీకాంత్ తన కుమార్తె విడాకుల వార్తతో కాస్త డిస్టర్బ్ అయ్యారు.
Read Also : 100 సార్లు పడిపోయా… వదిలేయాలని అనుకున్నా… కానీ… : సమంత
రజనీకాంత్ తన కూతురు, ధనుష్ కు మధ్య ఉన్న సమస్యను పరిష్కరించి, వారిని త్వరగా కలపాలని కోరుకుంటున్నారట. ఇప్పటికే ఆయన ఈ విషయమై ధనుష్, ఐశ్వర్యలతో ఫోన్‌లో మాట్లాడి తన అభిప్రాయాలను వెల్లడించినట్లు సమాచారం. ఇందులో ఎంతమేరకు నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ధనుష్, ఐశ్వర్యలను కలపడానికి రజినీకాంత్ ప్రయత్నాలు చేస్తున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఇక ఈ జంట ఇంకా అధికారికంగా విడాకులు తీసుకోలేదని వార్తలు వచ్చాయి. ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ ‘సర్’ షూటింగ్ ప్రారంభించాడు. ఈ ద్విభాషా చిత్రం ఈ సంవత్సరం విడుదల కానుంది.