మేడారంలో భక్తుల సందడి నెలకొంది. ముందస్తు మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చినవారికి వసతి సదుపాయం కల్పించారు. కరోనా వల్ల భక్తులు ముందుగానే వస్తున్నారు. జాతర రాకముందే బెల్లం బంగారంగా అమ్మవార్లకు సమర్పిస్తున్నారు. దర్శనం బాగా అయిందని భక్తులు చెబుతున్నారు.
మేడారం వెళ్లే సమ్మక్క, సారలమ్మ భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పింది టీఎస్‌ఆర్టీసీ… ఇవాళ్టి నుంచి మేడారం ప్రత్యేకంగా బస్సు సర్వీసులను నడపనుంది ఆర్టీసీ… హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయభాస్కర్ తెలిపారు. ఈ సర్వీసులు ప్రతీ రోజు అందుబాటులో ఉండనున్నాయి.. ఉదయం 7 గంటలకు హన్మకొండ నుంచి మేడారానికి బయల్దేరి, తిరిగి మేడారంలో సాయంత్రం 4 గంటలకు రిటర్న్ అవుతుంది.. ఇక, దీనికి చార్జీలను కూడా ఫిక్స్ చేసింది…
మేడారంలో సందడి నెలకొంది. వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఆదివారం, సంక్రాంతి సెలవులు కావడంతో వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముందస్తు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహంచి చీరె, సారె, పసుపు కుంకుమ, కొబ్బరికాయలు, బెల్లం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మేడారం పరిసరాల్లోని చెట్ల కింద వంటలు చేసుకుని భోజనాలు…
శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. బాలాలయం వద్ద భక్తులతో క్యూ లైన్లు కిక్కిరిసిపోవడంతో భక్తులకు సాధారణ దర్శనానికి రెండు గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. తెల్లవారుజామున 4 గంటలకు బాలాలయంలోని శ్రీ లక్ష్మీనృసింహ స్వామి వారికి ఆర్జిత సేవలు నిర్వహించారు. బాలాలయంలో ఆలయ అర్చకులు నిజాభిషేకం, సుదర్శన మహా హోమం నిర్వహించారు. గుట్టపైన ఉన్న పాత గోశాలలోని వ్రత మండపంలో జరిగిన శ్రీ సత్యనారాయణ స్వామి…
కార్తీక మాసం చివరిరోజు కావడంతో ఆదివారం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ఏవీ నగరం నుంచి సుమారు వందమంది భక్తబృందం రామనామ స్మరణ చేస్తూ ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. మూలవరులకు ఆదివారం ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఆర్జిత సేవగా సువర్ణపుష్పార్చన, సహస్రనామార్చన, కేశవనామార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ సీతారామచంద్రస్వామికి ఆదివారం నిత్యకల్యాణం వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి వారిని నిత్యకల్యాణ మండప వేదిక వద్దకు తీసుకొచ్చి…
భారతీయ జ్యోతిష శాస్త్రంలో శని గ్రహానికి ఒక ముఖ్యమయిన స్థానం వుంది. దీన్ని నపుంసక గ్రహంగా భావిస్తారు. వర్ణం నలుపు, నీలం. శని సూర్యుడి పుత్రుడు. అధిదేవత యముడు. శని మకరరాశి, కుంభరాశులకు అధిపతి అని చెబుతారు. శని జీవిత గమనానికి కావలసిన స్థిరాస్థులను ఏర్పరుచుకోవడానికి కారకుడౌతాడు కనుక కొంత మంచి జరుగుతుందంటారు. కష్టాలను ఓర్చుకునే శక్తిని, వాటిని అధిగమించే శక్తిని ఇచ్చి మనిషిని బంగారంలా మెరిసేలా చేస్తుంది. భక్తితో శనీశ్వరుడిని ప్రార్ధిస్తే సేవల ద్వారా స్వామి…
నిన్న తిరుమల శ్రీవారిని 18941 మంది భక్తులు దర్శించుకున్నారు. 8702 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అయితే నిన్న హుండి ఆదాయం 1.49 కోట్లు గ ఉంది. అయితే ఇవాళ వరహస్వామి ఆలయంలో మహసంప్రోక్షణకు అంకురార్పణ జరగనుంది. 14 కోట్ల రూపాయల వ్యయంతో వరహస్వామి ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులు చేయనున్నారు. రేపటి నుంచి ఐదు రోజులు పాటు సంప్రోక్షన కార్యక్రమాన్ని వైధికంగా నిర్వహించనున్నారు అర్చకులు. ఇక ఇదిలా ఉంటె భారీ వర్షాలతో తిరుమలలో వరదలు…
నేటి నుంచి శమరిమల అయ్యప్ప ఆలయంలోకి భక్తుల దర్శనానికి అధికారులు అనుమతి ఇచ్చారు. రోజుకు 30 వేల మంది భక్తులను అనుమతించనున్నారు. ఇక అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా టీకా సర్టిఫికెట్ లేదా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరిగా వెంట తీసుకురావాలి. డిసెంబర్ 26వ తేదీతో అయ్యప్ప మండల పూజ ముగియనున్నది. మండల పూజ అనంతరం మకరజ్యోతి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో శబరిమల వస్తుంటారు. మకరజ్యోతి పూర్తైన తరువాత జరవరి 20 వ తేదీన…
కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం ఈ నెల మూడో వారంలో తెరచుకోనుంది.. ఈనెల 15వ తేదీ నుంచి రెండు నెలల పాటు భక్తులకు దర్శనమివ్వనున్నారు అయ్యప్ప స్వామి.. భక్తుల మండల పూజ కోసం ఆలయాన్ని 15వ తేదీ నుంచి తెరవనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.. ఇక, ఇవాళ చితిర అత్తవిశేష పూజ సందర్భంగా ఆలయాన్ని తెరిచారు పూజారాలు.. పూజ ముగిసిన తర్వాత రాత్రి 9 గంటలకు తిరిగి ఆలయాన్ని మూసివేయనున్నారు.. కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక చర్యలు…