టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాను గుంటూరు నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును పరామర్శించేందుకు సీఐడీ కార్యాలయానికి వచ్చిన దేవినేని ఉమాను పోలీసులు అడ్డుకున్నారు. అశోక్‌బాబును కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులతో దేవినేని ఉమా వాగ్వాదానికి దిగారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో దేవినేని ఉమా సహా టీడీపీ నేతలు కోవెలమూడి రవీంద్ర, బుచ్చి రాంప్రసాద్, పిల్లి మాణిక్యాలరావు,…
తెలుగు దేశం పార్టీకి కరోనా టెన్షన్ పట్టుకుంది. ఆ పార్టీలో సీనియర్ నేతలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ముందుగా టీడీపీ అధినేత తనయుడు నారా లోకేష్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా… ఒక్కరోజు తేడాలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కరోనా వలలో చిక్కుకున్నారు. అంతకుముందు కూడా పలువురు టీడీపీ నేతలు కరోనా బారిన పడ్డా… ఇప్పుడు వరుసగా సీనియర్ నేతలకు కరోనా సోకడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. తాజాగా టీడీపీ సీనియర్ నేత,…
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు ఇంట్లో విషాదం నెలకొంది… దేవినేని ఉమ తండ్రి దేవినేని శ్రీమన్నారాయణ (చిన్ని) కన్నుమూశారు.. విజయవాడలోని రమేష్ ఆస్పత్రిలో గుండెపోటుతో ఆయన మృతిచెందినట్టు కుటుంబసభ్యులు చెబుతున్నారు.. ఆయన వయస్సు 88 సంవత్సరాలు.. కంకిపాడు మండలం నెప్పల్లి శ్రీమన్నారాయణ స్వగ్రామం కాగా.. కంచికచర్లలో స్థిరపడ్డారు. క్రియాశీలక రాజకీయాల్లో ఎప్పుడూ పాల్గొనకపోయినప్పటికీ ఆయన ఇద్దకు కుమారులు స్వర్గీయ దేవినేని వెంకటరమణ, దేవినేని ఉమామహేశ్వరరావుల ఎన్నికల ప్రచారంలో పలు సందర్భాల్లో…
పోలవరంపై ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుామరుకు మాజీ మంత్రి దేవినేని ఉమ కౌంటర్ ఇచ్చారు. దేవినేని ఉమ మాట్లాడుతూ… పోలవరం 2021 డిసెంబరుకు పూర్తి చేస్తామన్న మంత్రి అనిల్ ప్రకటన ఏమయ్యింది అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో, మీడియాలో జరిగే చర్చకు మంత్రి అనిల్ ఏమి సమాధానం ఇస్తారు అన్నారు. ప్రతిపక్షాలను తిట్టి పోలవరం నుంచి తప్పించుకోలేరు. పోలవరం కోసం కేంద్రం నుంచి వచ్చిన రూ. 4 వేల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు అని…
తీవ్ర ఉత్కంఠ మధ్య కృష్ణా జిల్లా కొండపల్లి మునిసిపల్ ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. చేయి ఎత్తి ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి చెన్నుబోయిన చిట్టిబాబుకు టీడీపీ కౌన్సిలర్లు మద్దతు ఇచ్చారు. వైసీపీ అభ్యర్థి జోగి రాముకు వైసీపీ కౌన్సిలర్ల మద్దతు లభించింది. టీడీపీ వైస్ ఛైర్ పర్సన్ అభ్యర్థులు లక్ష్మీ, శ్రీనివాస్ కు టీడీపీ కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. ఎక్స్ అఫిషీయో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకున్నారు టీడీపీ ఎంపీ…
కొండపల్లి ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియను జరిపి తీరాల్సిందేనని పట్టుపడుతోంది టీడీపీ. ఏదో విధంగా ప్రక్రియను ఆపేందుకు వైసీపీ తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో కొండపల్లి పంచాయతీ రసకందాయంగా మారింది. కొండపల్లి మునిసిపల్ ఎన్నికల ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియ సందర్భంగా జరిగిన పరిణామాలపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది టీడీపీ. గొడవ సృష్టిస్తోన్న వైసీపీపై చర్యలు తీసుకుని, సజావుగా మునిసిపల్ ఎన్నికలు జరిపించాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. హైకోర్టులో ఈ పిటిషన్…
ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగతున్నాయి. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ పై టీడీపీ, వైసీపీ నేతలు విమర్శలు చేసుకుంటునే.. మరో వైపు గత టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. వారి మాటలపై వైసీపీ నేతలు ఘాటుగా స్పందిస్తూ విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావు పలు వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చి 29 నెలలు గడిచినా…
గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. అధికారపార్టీ, ప్రతిపక్ష పార్టీలు బూతు పురాణాల రాజకీయంతో జనాలకు అసహ్యం వేస్తుంది. తాజాగా టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ కొడాలి నాని, వల్లభనేని వంశీని ఉద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత ఉద్దేశించి వల్లభనేని వంశీ, కొడాలి నాని పశువులకన్నా హీనంగా మాట్లాడారు… జగన్ అరాచక పాలనపై మేము మా నాయకుడు చంద్రబాబు నాయడు మాట్లాడితే మాపై శాపనార్థాలు పెడతారా అంటూ దేవినేని ఉమ…
కాసేపటి క్రితమే… రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్ పై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విడుదల అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వై.సి.పి ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన భయపడబోమని చెప్పారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు తోపాటు టిడిపి నేతలు నాకు మద్దతు ఇచ్చి ధైర్యం చెప్పారని.. అక్రమ గ్రావెల్ తవ్వకాలు అడ్డుకుంటే అరెస్టు చేశారని..దాడి జరిగిన సమయంలో పోలీసులు రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారని చెప్పారు. దాడి జరిగిన సమయంలో దాదాపు ఏడు…
కొండపల్లి కొండను తవ్వింది ఎవరు? తవ్వుకుని లాభపడింది ఎవరు? కొండ కరుగుతున్న సమయంలో రాజకీయ సెగ ఎందుకు రాజుకుంది? పైచెయ్యి సాధించాలనే ఎత్తులు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయా? మాటలతో ఒకరు.. సాంకేతిక అంశాలతో ఇంకొకరు.. ఒకరినొకరు ఇరుకున పెట్టుకునే వ్యూహాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. కొండపల్లి కొండ మైనింగ్‌పై రగడ! కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలో రాజకీయాలు సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడూ రగులుతూనే ఉంటాయి. ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో, ఎన్నికల తర్వాత ఇలా పరిస్థితులు ఎలా ఉన్నా…